AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Onam Photos: అందానికే కన్ను కుట్టేలా ఉన్న అనుపమా పరమేశ్వరన్‌… నెట్టింట వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫొటోలు.

Anupama Onam Photos: ప్రేమమ్‌ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార అనుపమ పరమేశ్వరన్‌. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుందీ...

Anupama Onam Photos: అందానికే కన్ను కుట్టేలా ఉన్న అనుపమా పరమేశ్వరన్‌... నెట్టింట వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫొటోలు.
Anupama
Narender Vaitla
|

Updated on: Aug 21, 2021 | 9:33 PM

Share

Anupama Onam Photos: ప్రేమమ్‌ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార అనుపమ పరమేశ్వరన్‌. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుందీ చిన్నది. ఇక ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించకపోయినప్పటికీ తనదైన నటనతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. తన క్యూట్‌ స్మైల్‌, ఆకట్టుకునే అందంతో ముఖ్యంగా కుర్రకారు హృదయాల్లో కేరింతలు కొట్టించిందీ అమ్మడు. ఎక్కడ ఎక్స్‌పోజింగ్‌కు తావు లేకుండా కేవలం ట్రెడిషనల్‌ లుక్స్‌తోనే మెస్మరైజ్‌ చేయడం అనుపమాకే దక్కిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుందీ బ్యూటీ. తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌లకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ఈ అమ్మడుకి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఓనమ్‌ వేడుకల్లో పాల్గొన్న ఈ అందాల ముద్దుగుమ్మ. లంగా ఓనీలో దిగిన కొన్ని ఫొటోలు దిగింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుందీ అమ్మడు. ‘హ్యాపీ ఓనమ్‌ అండ్‌ మి’ అనే కొంటే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. క్రీమ్‌ కలర్ ఓనీ, రెడ్‌ కలర్‌ జాకెట్‌లో అనసూయ అచ్చంగా దేవ కన్యాలా ఉందంటూ ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి అందాల అనుపమా ఆకట్టుకునే ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ దివి లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ

Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా ఈజీ.. ఈ ఐదు సూత్రాలు పాటించండి అంతే!

Social Media Harassment: విజయవాడలో దారుణం.. యువతి నగ్న చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఇద్దరు ఉన్నాదులు.