AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: ప్రేమను గెలిపించుకోవడం కోసం షారుఖ్ కష్టాలు.. సినిమా కథను తలపిస్తోన్న షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ..

ఇక షారుఖ్ బర్త్ డే వస్తే.. వేలాది మంది జనం ఆయన ఇంటిముందు వాలిపోతుంటారు అంటే జనాల్లో ఆయనకు ఉండే క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. రిలేషన్ షిప్స్.. లవ్ ఎఫైర్స్ అంటూ ఎలాంటి గాసిప్స్ లేని హీరో కూడా షారుఖ్ కావడం విశేషం. బాద్ షాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న

Shah Rukh Khan: ప్రేమను గెలిపించుకోవడం కోసం షారుఖ్ కష్టాలు.. సినిమా కథను తలపిస్తోన్న షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ..
Shah Rukh Khan
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2023 | 9:52 AM

Share

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‏గా ఎదిగారు. దేశవ్యా్ప్తంగానే కాదు.. వరల్డ్ వైడ్‏గా షారుఖ్ అంటే పడిచచ్చే అభిమానులున్నారు. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి తెలిసిందే. ఇక షారుఖ్ బర్త్ డే వస్తే.. వేలాది మంది జనం ఆయన ఇంటిముందు వాలిపోతుంటారు అంటే జనాల్లో ఆయనకు ఉండే క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. రిలేషన్ షిప్స్.. లవ్ ఎఫైర్స్ అంటూ ఎలాంటి గాసిప్స్ లేని హీరో కూడా షారుఖ్ కావడం విశేషం. బాద్ షాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న షారుఖ్ గురించి ఇప్పటివరకు ఎలాంటి లవ్ రూమర్స్ క్రియేట్ కాలేదంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే షారుఖ్ జీవితంలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అతని భార్య గౌరీ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి లవ్ స్టోరీ మాత్రం సినిమా కథను తలపిస్తోంది. ఎంతటి స్టా్ర్ అయిన.. వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి కోసం ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది.

షారుఖ్ ఖాన్ తో పెళ్లికి తన పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకోలేదని.. చాలా పట్టుబట్టి ఒత్తిడి తీసుకువస్తే తమ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు గౌరీ ఖాన్. గౌరీ ఖాన్ మాట్లాడుతూ.. “మా పెళ్లి జరిగే సమయానికి షారుఖ్ వయసు 26. నా వయసు 21 సంవత్సరాలు. ఒకటి కాదు.. రెండు కాదు.. మేము ఏకంగా మూడు సార్లు పెళ్లి చేసుకున్నామంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చింది. ఢిల్లీలోని కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ముందుగా షారుఖ్.. గౌరీకి తన ప్రేమ విషయాన్ని తెలియజేశాడట. ఆ తర్వాత కొద్ది రోజులకు గౌరీ ఖాన్ ఓకే చేసిందట. ఆరేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 1991 అక్టోబర్ 25న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి సుహాన ఖాన్, ఆర్యన్ ఖాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి
Shah Rukh, Gouri

Shah Rukh, Gouri

హీరో కాకముందు టెలివిజన్ రంగంలో షారుఖ్ పనిచేస్తున్న సమయంలోనే అతనికి గౌరీ అండగా ఉందట. అప్పట్లో గౌరీ.. షారుఖ్ కు ఆర్థికంగా ఎంతో సాయం చేసిందట. ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షారుఖ్.. వరుస హిట్స్ అందుకుని.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి కీలకపాత్రలో కనిపించనున్నారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై