AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: ముదురుతున్న  ట్విట్టర్ వార్.. ప్రకాష్ రాజ్ పై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఫైర్.. ప్రేక్షకులను మొరిగే కుక్కలంటావా అంటూ..

తాజాగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. అతను అంధకార్ రాజ్ అని అన్నారు.

Prakash Raj: ముదురుతున్న  ట్విట్టర్ వార్.. ప్రకాష్ రాజ్ పై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఫైర్.. ప్రేక్షకులను మొరిగే కుక్కలంటావా అంటూ..
Prakash Raj, Vivek Agnihotr
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2023 | 7:26 AM

Share

గత కొద్దిరోజులుగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారమే రేపాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాను నాన్సెన్స్ సినిమా అని.. అంతర్జాతీయ జ్యూరీ ఉమ్మివేసినప్పటికీ ఆస్కార్ కోసం అడుగుతున్నారని.. దానికి భాస్కర్ అవార్డ్ కూడా రాదన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. అతను అంధకార్ రాజ్ అని అన్నారు.

“ప్రజలందరూ ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ అనే చిన్న సినిమా అర్బన్ నక్సల్స్ అందరికీ నిద్రలేని రాత్రులను మిగిల్చింది. అలాంటి వారిలో ఒకరు .. ప్రేక్షకులను మొరిగే కుక్కలు అంటూ పిలుస్తున్నారు. సినిమా విడుదలై ఏడాది గడిచిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నారు. మిస్టర్ అంధకార్ రాజ్ నేను భాస్కర్ ను ఎలా పొందగలను. అది ఎప్పటికీ మీదే ” అంటూ కౌంటర్ ఇచ్చారు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

ఇటీవల కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్‌లో ప్రకాష్ రాజ్ కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడారు. నాన్‌సెన్స్‌ సినిమా అని ప్రకాష్‌ మాట్లాడుతూ.. “కాశ్మీర్‌ ఫైల్స్‌ నాన్‌సెన్స్‌ సినిమాల్లో ఒకటి. అయితే దీన్ని ఎవరు నిర్మించారో మాకు తెలుసు. అంతర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మివేసి.. వారు ఇంకా సిగ్గులేకుండా ఆస్కార్ అడుగుతున్నారు.. సదరు దర్శకుడు ఇలా అడగుతున్నారు. ‘నాకు ఆస్కార్ ఎందుకు లభించడం లేదు?’ అతనికి భాస్కర్ అవార్డ్ కూడా రాదు” అన్నారు. ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై వివేక్ స్పందిస్తూ.. ఒక వీడియోను కూడా పోస్ట్ చేసాడు, అందులో “ఈ అర్బన్ నక్సల్స్ అందరికీ, ఇజ్రాయెల్ నుండి వచ్చిన లెజెండరీ ఫిల్మ్ మేకర్‌కి నేను సవాలు చేస్తున్నాను, వారు ఏదైనా ఒక్క షాట్, ఈవెంట్ లేదా డైలాగ్ పూర్తిగా నిజం కాదని నిరూపించగలిగితే, నేను సినిమా నిర్మాణం నుండి తప్పుకుంటాను. . ప్రతిసారీ భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడే ఈ వ్యక్తులు ఎవరు? మోప్లా , కాశ్మీర్ నిజాలను బయటకు రావడానికి ఎప్పుడూ అనుమతించని వ్యక్తులు వీరే.” అంటూ రివర్స్ అటాక్ మొదలు పెట్టారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.