Brahmastra Part 2 : ఏంటి ఇది ఫ్యాన్ మెడ్ పోస్టరా..!! అదిరిపోయిందిగా..
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఏడాది క్రితం 'బ్రహ్మాస్త్ర' సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 'వార్ 2' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది! 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 2- దేవ్' 2026లో విడుదల కానుందని తెలుస్తోంది.
మొన్నామధ్య వరుస ఫ్లాప్స్ తో సతమతం అయిన బాలీవుడ్ ను ఆదుకున్న సినిమా ఏది అంటే బ్రహ్మాస్త్ర: శివ పార్ట్ 1 అనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా.. పర్లేదు అనిపించుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఏడాది క్రితం ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వార్ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది! ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ 2- దేవ్’ 2026లో విడుదల కానుందని తెలుస్తోంది. అంటే ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ సినిమా గురించిన అప్‌డేట్ వస్తుందా అనేది అనుమానమే. అయితే, కొందరు అభిమానులు మాత్రం అంత సమయం వేచిచూడలేకపోతున్నారు.
ఈ సినిమా గురించి కాస్త అప్‌డేట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో కొందరు సొంత పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో దేవ్, అమృతగా రణబీర్ కపూర్, దీపికా పదుకొణె కనిపించనున్నారు’ అని ఓ ఫ్యాన్ మెడ్ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ కు వేలల్లో లైక్‌లు వచ్చాయి. అలాగే ఈ పోస్టర్ కు కామెంట్స్ వర్షము కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఆలియా, రణ్‌బీర్ కపూర్‌ల కెమిస్ట్రీ సూపర్. ఇప్పుడు మరోసారి రణబీర్, దీపిక కెమిస్ట్రీని చూడాలని ఎదురుచూస్తున్నాం’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పోస్టర్ పై అయాన్ ముఖర్జీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
అయాన్ ముఖర్జీ ఇప్పటివరకు కేవలం మూడు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. విశేషమేమిటంటే.. ఈ మూడు సినిమాలను రణబీర్ కపూర్ తో చేశాడు. ‘బ్రహ్మాస్త్ర’ సూపర్‌హిట్ అయిన తర్వాత ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయాన్ ముఖర్జీ ప్రస్తుతం వార్ 2 తెరకెక్కిస్తున్నాడు. అటు రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 1న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.