Javed Khan: ప్రముఖ నటుడి హఠాన్మరణం.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ
జావేద్ గత కొన్నేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనను చేర్పించారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది.
సినిమా ఇండస్ట్రీని విషాదాలు వీడడం లేదు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహీ కన్నుమూశారు. ఆయన వయసు 50 ఏళ్లు. జావేద్ గత కొన్నేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనను చేర్పించారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. జావేద్ ఖాన్ ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారని డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా జావేద్ ఖాన్‌తో మరణంతో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.
కాగా ముంబైలో పుట్టిన జావేద్ ఖాన్ 1973 నుండి సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. 150 కి పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆయన సొంతం. ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ లగాన్, ఆషికీ, భాగీ, సడక్, అందాజ్ అప్నా అప్నా, కూలీ నెం.1, హలో బ్రదర్, షాదీ నెంబర్ వన్, ఉమ్రాన్‌జావ్, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ఇండియా, చక్‌దే ఇండియా, సడక్ 2, అందాజ్ అప్పా అప్పా, ఇష్క్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జావేద్ ఖాన్ చివరిగా సడక్ 2 మూవీలో నటించారు. బుధవారం (ఫిబ్రవరి 15) ఓషివారా స్మశానవాటికలో జావేద్ అంత్యక్రియలు జరగనున్నాయి.
बॉलीवुड फिल्मों में अपनी अदाकारी से लोगों का दिल जीतने वाले एक्टर जावेद खान अमरोही जी अब हमारे बीच नहीं रहे। 70 साल के जावेद जी ने 14 फरवरी की सुबह आखिरी सांस ली जावेद, ‘लगान’,’वन्स अपॉन ए टाइम’,और’चक दे इंडिया’जैसी फिल्मों के लिए पहचाने जाते हैं। #JavedKhanAmrohi #Lagaan #RIP pic.twitter.com/M2npEvbqzy
— Muhammad Azharuddin INC (@mdazhar_INC) February 14, 2023
अपनी बेहतरीन अदाकारी से करोड़ों लोगों का दिल जीतने वाले मशहूर बॉलीवुड अभिनेता जावेद खान अमरोही जी के इंतकाल की ख़बर अत्यंत दु:खद है। खुदा उनकी मगफिरत कर, जन्नत में आला मुकाम अता फरमाएं।
उनके परिजनों एवं सभी चाहने वालों के प्रति मेरी गहरी संवेदना है।#JavedKhan pic.twitter.com/CC1exMOY7P
— Nadeem Javed (@nadeeminc) February 14, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.