Telangana: అమ్మ బాబోయ్..! ఇవేం పాములు రా సామీ..! వరుసగా బయటపడుతున్న కొండచిలువలు
ఇటీవల ఈ ప్రాంతం లో కొండచిలువల బెడద పెరిగిపోయింది. కెనాల్ నుంచి ఆనకొండలు బయటకు వస్తున్నాయి. పొలాల నుంచి బయటకు రావడంతో రైతులు పరుగులు తీస్తున్నారు.
కొండ చిలువలు రైతులను భయపెట్టిస్తున్నాయి. వరి కోతలు పూర్తి కావడంతో.. కొండచిలువలు బయటకు వస్తున్నాయి. భారీ సైజ్ లో ఉన్న కొండ చిలువలు రోడ్లపై సంచరిస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతం లో కొండచిలువల బెడద పెరిగిపోయింది. దీంతో రైతులతో పాటు స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారు ప్రాంతంలో భారీ సైజ్ కొండ చిలువలు సంచారిస్తున్నాయి. నీరుకుల్ల రోడ్ లోని d86 కెనాల్ ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. వరి కోతలు పూర్తి కావడంతో ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నాయి కొండచిలువలు. దీంతో రాత్రి పూట వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎంతకీ రోడ్డుపై నుండి వెళ్లకపోవడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేస్తు్న్నారు. ప్రయాణికులు ధైర్యం చేసి కొండ చిలువలను తరిమేస్తున్నారు.
గత నాలుగు రోజుల క్రితం ఓ రైతు వరి పొలాన్ని హార్వెస్టింగ్ చేస్తుండగా, ఒక కొండచిలువ హార్వెస్టర్ లో ఇరుక్కుని చనిపోయింది. ఇక మార్నింగ్ వాకింగ్ వెళ్లే వాకర్స్‌కు కొండచిలువలు కనిపిస్తుండటంతో కొన్ని రోజులుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో వరుసగా కొండచిలువలు బయటపడుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఇటీవల ఈ ప్రాంతం లో కొండచిలువల బెడద పెరిగిపోయింది. కెనాల్ నుంచి ఆనకొండలు బయటకు వస్తున్నాయి. పొలాల నుంచి బయటకు రావడంతో రైతులు పరుగులు తీస్తున్నారు. అప్పుడప్పుడు.. స్నేక్ క్యాచర్స్ కి సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారు. ఈ కొండచిలువ నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు రైతులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..