Telangana: తెలంగాణ దండకారణ్యంలో అలజడి.. మరో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

అడవిలో అలజడి... దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లుతోంది.. తుపాకుల మోతలతో రక్తమోడుతోంది. పచ్చని అటవీప్రాంతం ఎరుపెక్కుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం వరుస ఎన్‌కౌంటర్లతో రక్తసిక్తమయిన విషయం తెలిసిందే.. తాజాగా.. తెలంగాణలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

Telangana: తెలంగాణ దండకారణ్యంలో అలజడి.. మరో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Encounter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 01, 2024 | 10:21 AM

అడవిలో అలజడి… దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లుతోంది.. తుపాకుల మోతలతో రక్తమోడుతోంది. పచ్చని అటవీప్రాంతం ఎరుపెక్కుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం వరుస ఎన్‌కౌంటర్లతో రక్తసిక్తమయిన విషయం తెలిసిందే.. తాజాగా.. తెలంగాణలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌంబ్స్ బలగాల  మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఈ భారీ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కీలక నేత బద్రు ఎన్కౌంటర్‌లో మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. ఆయనతోపాటు మృతుల్లో మరికొందరు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది..

సరిగ్గా వారం రోజుల క్రితం ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫార్మార్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. వారం తిరగకముందే.. ఏడుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ లో చనిపోయారు.. ఆదివాసీల హత్య అనంతరం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీ కూంబింగ్ నిర్వహించారు.. ఈ క్రమంలోనే.. చల్పాక సమీప అడవుల్లో పోలీసు జవాన్లకు.. మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులపైకి కాల్పులు జరపడంతో.. గ్రేహౌండ్స్ బలగాలు తిరిగి కాల్పులు జరిపారు. ఘటనాస్థలంలో రెండు AK-47 రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ హతమైనట్లు తెలిపారు.

14 ఏళ్ల తర్వాత..

డిసెంబర్ 2 (రేపటి నుండి) నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ పి.ఎల్.జి.ఏ వారోత్సవాలు నేపథ్యంలో మావోయిస్టులు కీలక భేటీ నిర్వహించారు.. అయితే. ఈ భేటీపై పక్కా సమాచారంతో పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. 14 సంవత్సరాల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో అతి పెద్ద ఎన్కౌంటర్ జరగినట్లు అధికారులు తెలిపారు.

చనిపోయినవారి వివరాలు ..

1. కుర్సం మంగు (35) అలియాస్‌ భద్రు, అలియాస్‌ పాపన్న, ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సెక్రటరీ గా పనిచేస్తున్నాడు.

2. ఎగోలపు మల్లయ్య(43) అలియాస్‌ మధు, అలియాస్‌ కమలాకర్‌, ఏటూరు నాగారం మహదేవ్‌పూర్‌ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు.

3. ముస్సకి దేవల్‌ (21) అలియాస్‌ కరుణాకర్‌, ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యుడిగా..

4. ముస్సకి జమున (21) ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.

వీరితోపాటు.. 5. జైసింగ్‌, 6. కిషోర్‌, 7. కమలేష్‌, మావోయిస్టు పార్టీ మెంబర్లుగా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?