AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో సంచలన నిర్ణయం.. కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటానని ప్రకటన..

అక్షయ్ కుమార్ తన పౌరసత్వాన్ని వదులుకుంటానని ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. 2019 లోక్ సభ ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్షయ్ కుమార్ పౌరసత్వంపై దుమారం రేగింది.  అప్పటి నుంచి అక్కి కెనడా పౌరసత్వం వివాదం అప్పుడప్పుడు తెరమీదకు వస్తూనే ఉంది.

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో సంచలన నిర్ణయం.. కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటానని ప్రకటన..
Akshay Kumar
Follow us
Surya Kala

|

Updated on: Feb 24, 2023 | 11:41 AM

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా క్రేజ్ ను సొంతం చేసుకున్న  బాలీవుడ్ స్టార్ హీరో  అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వంపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకోనున్నట్లు వెల్లడించి అందిని షాక్ గు గురి చేశాడు అక్కీ. ఈ యాక్షన్ హీరో. అయితే అక్కీపై ఎప్పటి నుంచో కెనడా పౌరసత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న సీధీ బాత్  కొత్త సీజన్  ఫస్ట్ ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా హాజరైన అక్షయ్ కుమార్  కెనడా పౌరసత్వాన్ని వదులుకోనున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. అసలు తాను ఎందుకు కెనడా పౌరసత్వం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాడు కూడా..

భారతదేశమే నాకు సర్వస్వం.. నేను సంపాదించినదంతా ఇక్కడి నుంచే.. ఏమి సాధించినా అన్నీ ఇక్కడ నుంచే.. నేను పొందిన దానిని తిరిగి నా దేశానికి ఇచ్చే అదృష్టం కూడా నాకు దక్కింది. అసలు నా గురించి ఏమీ తెలియకుండా మాట్లాడే మాటలు తనకు ఎంతో బాధకలిగిస్తాయని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

అయితే అక్షయ్ కుమార్ తన పౌరసత్వాన్ని వదులుకుంటానని ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు.  2019 లోక్ సభ ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్షయ్ కుమార్ పౌరసత్వంపై దుమారం రేగింది.  అప్పటి నుంచి అక్కి కెనడా పౌరసత్వం వివాదం అప్పుడప్పుడు తెరమీదకు వస్తూనే ఉంది.

బాలీవుడ్ యాక్షన్ అండ్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అగ్ర హీరో అక్షయ్ కుమార్.. అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా.  ఫ్యాన్స్ ముద్దుగా అక్కీ అని పిలుచుకుంటారు. అక్షయ్ కుమార్ కెనడా ప్రవాస భారతీయుడని తెలిసిందే. వాస్తవానికి 90లో అక్కీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఓటమి చెందాయి. దీంతో స్నేహితుడి సలహా మేరకు  కెనడాకు పని కోసం వెళ్లిన అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం మళ్ళీ అక్షయ్ ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు పడడం.. వరస సినిమా ఆఫర్లతో మళ్ళీ బాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు.  ప్రస్తుతం రెండు మూడు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న అక్కీ మూడు నిమిషాల్లో 184 సెల్ఫీ ఫొటోలు దిగి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హీరోగా ఘనత సాధించాడు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..