Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr Mehmood Died: సినీ ఇండస్ట్రీని వీడని విషాదాలు.. క్యాన్సర్‌తో పోరాడుతూ జూ. మెహమూద్ మృతి..

జానీ లివర్..  జూనియర్ మహమూద్‌తో ఉన్న ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో తన స్నేహితుడు ..  బాలీవుడ్ నటుడి జూనియర్ మహమూద్‌ ఆరోగ్యం క్షీణించడం గురించి చెప్పాడు . కోలుకుని క్షేమంగా ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి చేరుకోవాలని ప్రార్థన చేయమని తన అభిమానులను కోరాడు. అయితే జూనియర్ మెహమూద్ మరణవార్తతో సినీ నటులు, అభిమానులకు విషాదాన్ని నింపింది. ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, టీవీ స్టార్లతో పరిచయం ఉంది.

Jr Mehmood Died: సినీ ఇండస్ట్రీని వీడని విషాదాలు.. క్యాన్సర్‌తో పోరాడుతూ జూ. మెహమూద్ మృతి..
Junior Mehmood Passed Away
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2023 | 9:05 AM

చలన చిత్ర పరిశ్రమలో వరస విషాదాల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా  ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ జీవితంతో పోరాడి పోరాడి ఆలసిపోయి కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో జూనియర్ మహమూద్‌కు బాధపడుతున్నారు. ప్రస్తుతం క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉందని.. ఆరోగ్యం క్షీణించిందని వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన క్షేమం కోసం అభిమానులు ప్రార్ధనలు చేశారు.  అయితే జూనియర్ మహమూద్‌ 40 రోజుల కంటే ఎక్కువ జీవించలేడని వైద్యులు కూడా చెప్పారు. ఆస్పత్రిలో క్యాన్సర్ తో పోరాడుతూ చివరకు 67 ఏళ్ల వయసులో జూనియర్ మహమూద్ ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. అసలు పేరు నయీమ్ సయ్యద్. అయితే బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు మెహమూద్ ని తలపించేలా యాక్టింగ్ ఉండడంతో జూనియర్ మెహమూద్ గా అభిమానులు పిలుచుకుంటారు.

మెహమూద్ సన్నిహితుడు సలీం ఖాజీ మరణ వార్తను ధృవీకరించాడు. అంతకు ముందు జానీ లివర్..  జూనియర్ మహమూద్‌తో ఉన్న ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో తన స్నేహితుడు ..  బాలీవుడ్ నటుడి జూనియర్ మహమూద్‌ ఆరోగ్యం క్షీణించడం గురించి చెప్పాడు . కోలుకుని క్షేమంగా ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి చేరుకోవాలని ప్రార్థన చేయమని తన అభిమానులను కోరాడు. అయితే జూనియర్ మెహమూద్ మరణవార్తతో సినీ నటులు, అభిమానులకు విషాదాన్ని నింపింది. ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, టీవీ స్టార్లతో పరిచయం ఉంది. ఇండస్ట్రీలో 5 దశాబ్దాలకు పైగా పనిచేసిన అతికొద్ది మంది నటుల్లో జూనియర్ మహమూద్‌ ఒకరు.

[చిత్రం: జూనియర్ మెహమూద్ Img]

ఇవి కూడా చదవండి

రాజేష్ ఖన్నాతో జూనియర్ మెహమూద్‌

నివేదికల ప్రకారం స్టమక్ క్యాన్సర్ బారిన పడిన జూనియర్ మెహమూద్‌ క్యాన్సర్ 4వ దశలో ఉందని నెల రోజుల క్రితం తెలిసింది. అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆరోగ్యం క్షీణించడంతో లైఫ్ సపోర్టులో ఉన్నారని సలాం ఖాజీ తెలిపారు.

రాజేష్ ఖన్నాతో అద్భుతమైన జోడీ

జూనియర్ మెహమూద్‌ చాలా సినిమాలు, టీవీ సీరియల్స్‌లో పనిచేశాడు.  తన 11 ఏళ్ల వయసులో 1967లో సంజీవ్ కుమార్ చిత్రం నౌనిహాల్‌తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. నటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు.  సంఘర్ష్, బ్రహ్మచారి, దో రాస్తే, కటి పతంగ్, హాథీ మేరే సాథీ, హంగామా, ఛోటీ బహు, దాదాగిరి వంటి అనేక చిత్రాలలో పనిచేశాడు. బాల్‌రాజ్ సాహిని నుంచి సల్మాన్ ఖాన్ వంటి స్టార్‌లతో కలిసి పనిచేశాడు. అయితే ఎక్కువగా జూనియర్ మెహమూద్‌..  రాజేష్ ఖన్నా, గోవింద చిత్రాలలో కనిపించాడు. రాజేష్ ఖన్నాతో  నటించిన హాథీ మేరే సాథీ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పవచ్చు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..