TOP 9 ET: హింట్‌ దొరికింది భయ్యా.. ఇక దేత్తడే | రొమాంటిక్ బాబు.. మహేష్ బాబు

TOP 9 ET: హింట్‌ దొరికింది భయ్యా.. ఇక దేత్తడే | రొమాంటిక్ బాబు.. మహేష్ బాబు

Anil kumar poka

|

Updated on: Dec 08, 2023 | 8:54 AM

సలార్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, నెక్ట్స్ మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్న నీల్‌, ఆ సినిమా తన రెగ్యులర్‌ స్టైల్‌కు భిన్నంగా ఉంటుందని తెలిపారు. దీంతో ఈ సినిమా మరింత మాసీగా దేత్తడి యాక్షన్‌గా ఉంటుందని అప్పుడే ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేశారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

01.NTR
సలార్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, నెక్ట్స్ మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్న నీల్‌, ఆ సినిమా తన రెగ్యులర్‌ స్టైల్‌కు భిన్నంగా ఉంటుందని తెలిపారు. దీంతో ఈ సినిమా మరింత మాసీగా దేత్తడి యాక్షన్‌గా ఉంటుందని అప్పుడే ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేశారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

02. Gunturu Karam
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం అప్‌డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సెకండ్ సింగిల్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా దీని అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. డిసెంబర్ 11 గుంటూరు కారం రెండో పాట విడుదల కానుంది. ఇది రొమాంటిక్ సింగిల్ అని కన్ఫర్మ్ చేసారు మేకర్స్.

03.Hi Nanna
హాయ్ నాన్న సినిమాకు నాని పడిన కష్టం కలెక్షన్లలో కనిపిస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజు ఓవర్సీస్ నుంచి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు అక్కడ్నుంచి ఇప్పటికే 2 లక్షల డాలర్లు వచ్చాయి. ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే మిలియన్ మార్క్ అందుకునేలా కనిపిస్తుంది. శౌర్యు ఈ సినిమాకు దర్శకుడు.

04.Suriya
ప్రస్తుతం కంగువ వర్క్‌లో బిజీగా ఉన్న సూర్య, నెక్ట్స్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఆ సినిమాను జై భీమ్‌ తరహాలో రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్‌. 1965లో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నారు.

05.KGF 3
కేజీఎఫ్ 3 తప్పకుండా వస్తుందని మరోసారి ఖరారు చేసారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.. కానీ ఆ సినిమాను తాను తెరకెక్కిస్తానో లేదో అంటూ ట్విస్ట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. యష్ మాత్రం అందులో ఉంటారనే విషయం కన్ఫర్మ్ చేసారు. నిజానికి కెజిఎఫ్ 2 అయిపోయినపుడే పార్ట్ 3 స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసామని.. అయితే అది రావడానికి ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పారు ప్రశాంత్ నీల్.

06.Polimera
సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది. ఈ మధ్యే దీనికి సీక్వెల్ వచ్చి థియేటర్లలోనే సూపర్ హిట్ అయింది. తాజాగా ‘మా ఊరి పొలిమేర-2’ ఆహాలో విడుదలైంది. ఓటిటిలోనూ ఇది అదరగొడుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.

07.Vijay
తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమిళనాడు ప్రజలను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ కదిలింది. ఇప్పటికే విశాల్‌ లాంటి వారు ప్రత్యక్షంగా సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. తాజాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజయ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఫ్యాన్స్‌ను కోరారు.

08.Shahrukh
కూతురి డెబ్యూ విషయంలో చాలా ఎగ్జైట్ అవుతున్నారు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్. ది ఆర్చీస్ అనే వెబ్ సిరీస్‌తో గ్లామర్ ఫీల్డ్‌కు పరిచయం అవుతున్నారు సుహాన. ఇటీవల ఈ షో ప్రీమియర్ జరిగింది. ఈ కార్యక్రమానికి కూతురితో కలిసి వచ్చిన షారూఖ్‌ ఆ క్షణం ప్రపంచాన్ని గలిచినట్టుగా అనిపించింది అన్నారు.

09.Rama Mandir
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు కూడా పంపుతున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు రామాయణం టీవీ సీరియల్‌తో పాపులర్ అయిన నటులకు కూడా ఆహ్వానాలు అందాయి. రాముడిగా నటించిన అరుణ్ గోవిల్‌, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ప్రత్యేక ఆహ్వానం అందింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.