Katrina Kaif: అప్పుడు అతనితో నటించను అని తేల్చి చెప్పింది.. కానీ ఇప్పుడు ఆ హీరోతోనే

రణబీర్ కపూర్ ఆతర్వాత అలియాభట్ తో ప్రేమలో పడ్డాడు.. ఆతర్వాత పెళ్లి చేసుకున్నారు. అలాగే కత్రినా విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రణబీర్ కపూర్ కత్రినా కైఫ్ కలిసి 'అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ' (2009), 'రాజనీతి' (2019), 'జగ్గా జాసూస్' (2017) సినిమాల్లో నటించారు. ఆతర్వాత బ్రేకప్ అయిన తర్వాత  ఇకపై కలిసి నటించబోమని కత్రినా స్పష్టం చేసింది.

Katrina Kaif: అప్పుడు అతనితో నటించను అని తేల్చి చెప్పింది.. కానీ ఇప్పుడు ఆ హీరోతోనే
Katrina Kaif Ranbir Kapoor
Follow us
Rajeev Rayala

|

Updated on: May 18, 2024 | 12:30 PM

రణబీర్ కపూర్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆతర్వాత ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. రణబీర్ కపూర్ ఆతర్వాత అలియాభట్ తో ప్రేమలో పడ్డాడు.. ఆతర్వాత పెళ్లి చేసుకున్నారు. అలాగే కత్రినా విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రణబీర్ కపూర్ కత్రినా కైఫ్ కలిసి ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ (2009), ‘రాజనీతి’ (2019), ‘జగ్గా జాసూస్’ (2017) సినిమాల్లో నటించారు. ఆతర్వాత బ్రేకప్ అయిన తర్వాత  ఇకపై కలిసి నటించబోమని కత్రినా స్పష్టం చేసింది. దాంతో ఈ ఇద్దరూ కలిసి ఒక్క సినిమాలోనూ నటించలేదు.

2017లో కత్రినా కైఫ్‌ను దీని గురించి మాట్లాడింది. ‘రణ్‌బీర్‌తో మళ్లీ కలిసి నటిస్తారా.?’ అన్న ప్రశ్నకు కత్రినా బదులిస్తూ, ‘ఇది చాలా కష్టమైంది. ఇకపై కలిసి పనిచేయబోమని కత్రినా చెప్పింది. అయితే ఈ విషయంపై రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘అది ఆమె సరదాగా చెప్పింది. నేను ఆమెపై జోక్ చేసాను, ఆమె నాపై జోక్ చేసింది. నేను కత్రినాతో కూడా మాట్లాడాను అని రణబీర్ చెప్పాడు.  ఆతర్వాత కత్రినా కూడా నేనెప్పుడూ అలా చెప్పలేదని కత్రినా చెప్పుకొచ్చింది.

‘నాకు, కత్రినాకు మధ్య మంచి ఆన్ సీన్ కెమిస్ట్రీ  ఉంది. ఆమెతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం. అతను నా స్టార్‌డమ్‌ని పెంచింది. నాకంటే ఆమె పెద్ద స్టార్‌’ అని రణ్‌బీర్‌ కపూర్‌ అన్నారు. రణ్‌బీర్‌ హీరోగా ‘జగ్గా జాసూస్‌’ చిత్రాన్ని కూడా నిర్మించాడు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. కానీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీని తర్వాత కత్రినా, రణబీర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సంజయ్ లీలా బన్సాలీ ‘లవ్ అండ్ వార్’లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జనవరిలో ప్రకటించారు. 2025 క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోసారి కత్రినా, రణబీర్ కలిసి నటించడం విశేషంగా మారింది. రణబీర్ ‘రామాయణం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘మేరీ క్రిస్మస్’ తర్వాత కత్రినా కొత్త సినిమాని ప్రకటించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించనుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.