AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satish Kaushik: బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. ఫామ్‌హౌస్‌లో పోలీసులకు దొరికిని కీలక ఆధారాలు

Satish Kaushik: ఎప్పుడూ నవ్వుతూ, నవ్వుతూ ఉండే సతీష్ కౌశిష్ ఈ లోకంలో లేరంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Satish Kaushik: బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. ఫామ్‌హౌస్‌లో పోలీసులకు దొరికిని కీలక ఆధారాలు
Satish Kaushik Passed Away
Balaraju Goud
|

Updated on: Mar 11, 2023 | 2:26 PM

Share

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ గుండె పోటుతో కన్నుమూశారు. సతీష్ కౌశిక్ ఆకస్మిక మరణంతో అందరూ షాక్ అయ్యారు. సతీష్ కౌశిక్ మృతదేహం గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో ఉండగా పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ముంబైకి తరలించారు. సతీష్ కౌశిక్ తన కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించాడు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సతీష్ కౌశిక్ తన కుటుంబానికి కోట్లాది రూపాయల సంపదను అందించారు.

66 ఏళ్ల సతీష్ కౌశిక్ గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. సతీష్ కౌశిక్ మృతిని తొలుత ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ బయటకు చెప్పారు. ఢిల్లీ శివార్లలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కౌశిక్, అక్కడ హోలి సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. తిరిగి ఢిల్లీకి వస్తుండగా ఆయనకు కారులోనే గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, ఫలించలేదు. చికిత్స పొందుతూనే సతీష్ కౌశిక్ తుది శ్వాస విడిచారు.

అయితే ఆయన హఠాన్మరణం సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఇది మామూలు మరణం కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సతీష్ కౌశిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. పోలీసు బృందం ఆయన ఫామ్ హౌస్‌లో విచారించగా.. కొన్ని కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం.

ఫామ్ హౌజ్‌లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిషేధ ఉత్పేరిత డ్రగ్స్‌ను దొరికాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఆ సమయంలో ఫామ్‌హౌస్‌లో హోలీ పార్టీకి వచ్చిన అతిథుల జాబితాను కూడా పోలీసులు సిద్ధం చేశారు. నిసతీష్ కౌశిక్ మృతి తర్వాత పరారీలో ఉన్న పారిశ్రామికవేత్తను కూడా పోలీసులు విచారించాలకుంటున్నారు. పోలీసుల విచారణలో ఫామ్ హౌస్‌లో దొరికిన అభ్యంతరకరమైన మందుల ప్యాకెట్లు ఎవరి కోసం, ఎందుకు వచ్చాయనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. సతీష్ కౌశిక్‌తో అతనికి ఏమైనా సంబంధం ఉందా? దర్యాప్తులో తేలాల్సి ఉంది.

సతీష్ కౌశిక్ స్వస్థలం హర్యానాలోని మహేంద్రఘడ్‌. హిందీ సినిమా ‘మాసూమ్’ ద్వారా నటుడిగా చిత్ర పరిశ్రమకు పరిచమయ్యాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు మాటలు రాశారు. దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, ఆయన కలిసి కొన్ని చిత్రాలు నిర్మించారు. ‘మిస్టర్ ఇండియా’, ‘దీవానా మస్తానా’, ‘బ్రిక్ లేన్’, ‘రామ్ లఖన్’, ‘సాజన్ చలే ససురాల్’ తదితర చిత్రాల్లో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ ‘ఛత్రివాలి’లో కూడా సతీష్ కౌశిక్ కనిపించారు. సతీష్ కౌశిక్ నటించిన ‘ఎమర్జెనీ’ ఇంకా విడుదల కావాల్సి ఉంది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన ‘రూప్ కి రాణి చారోన్ కి రాజా’ సినిమాతో సతీష్ కౌశిక్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సల్మాన్ ఖాన్, భూమిక జంటగా నటించిన ‘తేరే నామ్’ దర్శకుడు కూడా ఆయనే. సుమారు 15 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తీసిన చివరి సినిమా ‘కాగజ్’. ఎప్పుడూ నవ్వుతూ, నవ్వుతూ ఉండే సతీష్ కౌశిష్ ఈ లోకంలో లేరంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. అదే సమయంలో, సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్‌లతో సహా బి-టౌన్ స్టార్స్ అందరూ సతీష్‌కు కడసారి వీడ్కోలు పలికారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి