Actress: ప్రియుడితో 4 ఏళ్లు సహజీవనం.. సీక్రెట్ గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు.. రూ.25 లక్షలు డిమాండ్..
ఇప్పుడు సినీరంగంలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్ అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న పలువురు తారలు కొన్ని నెలలకే విడిపోతున్నారు. యాక్టర్స్, క్రికెటర్స్, సింగర్స్ ఇలా పాపులర్ సెలబ్రెటీలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. తాజాగా మరో జంట విడిపోయేందుకు రెడీ అయ్యింది.

ప్రస్తుతం సెలబ్రెటీస్ పర్సనల్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీతారల ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి నిత్యం ఏదోక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర నటి ఫేమస్ సైన్స్ డ్రామా సిరీస్ అయిన అపోలీనా ఫేమ్ అదితి శర్మ తన భర్త అభిజిత్ కౌశిక్ తో విడిపోయినట్లు తెలుస్తోంది. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట విడాకులు తీసుకోవడం గమనార్హం. గతేడాది నవంబర్ నెలలో రహస్యంగా పెళ్లి చేసుకున్న అదితి శర్మ, అభిజిత్ కౌశిక్.. ఇప్పుడు నెలలు కూడా కలిసి ఉండలేక డివోర్స్ కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది అదితి శర్మ. అటు సీరియల్స్.. ఇటు షోలలో కనిపిస్తూ అభిమానులను సంపాదించుకుంది. అయితే గత నాలుగేళ్లుగా అదితి అభిజిత్ కౌశిక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. వీరిద్దరి ప్రేమాయణం బాలీవుడ్ మొత్తం తెలుసు. అంతకు ముందు వీరిద్దరు క్లోజ్ గా కలిసి ఉన్న పోటోలను నెట్టింట షేర్ చేశారు. ఇన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు గతేడాది నవంబర్ లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన కెరీర్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇలా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అదితి భర్త అభిజిత్ తెలిపారు. కానీ ఇప్పుడు ఆమె ప్రవర్తన నచ్చక విడిపోవడానికి రెడీ అయినట్లు తెలిపారు. అభిజత్ న్యాయ సలహాదారు రాకెశ్ శెట్టితో ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘అదితి నేను నాలుగేళ్లుగా కలిసి ఉన్నాం. గతేడాది నవంబర్ 12న సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాం. ఏడాదిన్నరగా ఆమె నాపై ఒత్తిడి తేవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం. కానీ పెళ్లి విషయం బయటకు తెలిస్తే తన కెరీర్ కు ఇబ్బంది కలుగుతుందని అదితి చెప్పడంతో మా రెండు కుటుంబాల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాం. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కూడా ఉన్నాయి.’అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు అదితి ప్రవర్తన నచ్చకపోవడంతో అభిషేక్ విడాకులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె అపోలీనా కో స్టార్ సమర్థ గుప్తాతో సన్నిహితంగా ఉంటుందని.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు తాను చూశానని అభిషేక్ అన్నాడు. అయితే విడాకులు తీసుకోవడానికి అదితి శర్మ ఫ్యామిలీ రూ.25 లక్షలు డిమాండ్ చేశారని అభిషేక్ అన్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..