Anil Kapoor: యానిమల్ నటుడి సంపాదన తెలిస్తే మతిపోవాల్సిందే.. షాకిస్తున్న అనిల్ కపూర్ ఆస్తుల వివరాలు..

నటుడిగానే కాకుండా నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఇప్పటికీ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఇటీవలే సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో రణభీర్ కపూర్ తండ్రిగా కనిపించారు. సినిమాకి కోట్ల రూపాయలు వసూలు చేసే అనిల్ కపూర్ ప్రకటనల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నాడు.

Anil Kapoor: యానిమల్ నటుడి సంపాదన తెలిస్తే మతిపోవాల్సిందే.. షాకిస్తున్న అనిల్ కపూర్ ఆస్తుల వివరాలు..
Anil Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 21, 2024 | 1:48 PM

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశబ్దాలుగా సినీ పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అనిల్ కపూర్ ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించి అభిమానుల హృదయాలను ఏలారు. 1979లో ‘హమారే తుమ్హారే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనిల్ కపూర్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డమ్ అందుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఇప్పటికీ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఇటీవలే సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో రణభీర్ కపూర్ తండ్రిగా కనిపించారు. సినిమాకి కోట్ల రూపాయలు వసూలు చేసే అనిల్ కపూర్ ప్రకటనల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నాడు.

అనిల్ కపూర్ నికర విలువ 140 కోట్లు. అంతేకాదు అతనికి ముంబైలో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. అనిల్ కపూర్‌కు మూడు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయని సమాచారం. అలాగే అతడి గ్యారేజీలో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అనిల్ కపూర్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని జుహులో ఒక విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు. బంగ్లాలో ఖరీదైన ఫర్నిచర్ ఉంది.తన ఇంటిని పురాతన హౌస్ ఫీలింగ్ కలిగేలా నిర్మించుకున్నాడట. ఈ హీరోకు ఉన్న మొత్తం మూడ ఇళ్ల విలువ దాదాపు రూ.35 కోట్లు.

అనిల్ కపూర్‌కి కార్లంటే చాలా ఇష్టం. అతని వద్ద ఖరీదైన కార్లు ఉన్నాయి. పోర్షే, బెంట్లీ, BMW, జాగ్వార్, ఆడి వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాదు కోటి 45 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కారును కూడా కలిగి ఉన్నాడు.. అతని అన్ని కార్ల ధర దాదాపు రూ.9 కోట్లు. సమాచారం ప్రకారం గత కొన్నేళ్లుగా అనిక్ కపూర్ సంపద 35 శాతం పెరిగింది. అనిల్ కపూర్ సంవత్సరానికి 12 కోట్లు సంపాదిస్తున్నాడు. నివేదికల ప్రకారం, ‘బిగ్ బాస్ OTT 3’ కోసం అనిల్ కపూర్ ఒక ఎపిసోడ్‌కు రూ. 2 కోట్లు వసూలు చేయనున్నాడు.

అనిల్ కపూర్ వారంలో రెండు రోజులు మాత్రమే హోస్ట్ చేయనున్నారు. దీని కోసం షో మేకర్స్ అనిల్ కపూర్ కోసం ఒక వారానికి 4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనిల్ కపూర్ సావి చిత్రంలో నటిస్తున్నారు. అలాగే పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్