Amitabh Bachchan: ధ్యావుడా.. ఖరీదైన ఇల్లు అమ్మేసిన అమితాబ్.. ధర తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబైలోని తన విలాసవంతమైన ఇంటికి విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ ఇంటి అమ్మడం ద్వారా దాదాపు 168 శాతం లాభం పొందారట. ఇంతకీ ఆ ఇల్లు ఎంతకి అమ్మబడింది.. ? అసలు ఎందుకు ఆ ఇంటిని విక్రయించాల్సి వచ్చింది అనే విషయాలు తెలుసుకుందామా.

బాలీవుడ్ మెగా హీరో అమితాబ్ బచ్చన్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటివరకు అమితాబ్ సంపద కోట్లలో ఉంది. దేశవ్యాప్తంగా అనేక అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. ముంబైలోని ఓషివారాలో అపార్ట్‌మెంట్ ఒకటి ఉంది. అదే అపార్ట్‌మెంట్‌ను బిగ్ బి 2025లో భారీ లాభంతో విక్రయించారు. 31 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ఆస్తిని అమితాబ్ బచ్చన్ 83 కోట్లకు అమ్మినట్ల సమాచారం. ఇదే అపార్ట్మెంట్ లో కృతి సనన్ అద్దెకు సైతం ఉన్నారట.
బిగ్ బీ తన అపార్ట్మెంట్ అమ్మడం ద్వారా 168 శాతం లాభం పొందారు . అందుతున్న సమాచారం ప్రకారం 2021లో బిగ్ బి ఈ విలాసవంతమైన ఇంటిని రూ.31 కోట్లకు కొనుగోలు చేశారు. బిగ్ బి విలాసవంతమైన అపార్ట్మెంట్ 529.94 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 5185.62 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతంతో నిర్మించబడింది. ఇది 445.93 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 6 కార్లకు పార్కింగ్ సౌకర్యం ఉంది. అమితాబ్ బచ్చన్ ఈ అపార్ట్‌మెంట్‌ను నవంబర్ 2021లో కృతి సనన్‌కి అద్దెకు ఇచ్చారు. కృతి అమితాబ్ బచ్చన్‌కు విలాసవంతమైన ఇంటి అద్దెగా నెలకు రూ.10 లక్షలు చెల్లించేది. నటి నుంచి 60 లక్షల రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకున్నారు.
అమితాబ్ బచ్చన్ మొత్తం సంపద రూ.273.74 కోట్లు ఉన్నట్లు సమాచారం. జయ బచ్చన్, అమితాబ్ మొత్తం సంపద కలిపి రూ.849.11 కోట్లు. బిగ్ బీ, జయల స్థిరాస్తుల విలువ 729.77 కోట్లు. వారి వద్ద నగలు, ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. 82 ఏళ్ల వయసులో కూడా బిగ్‌బి బుల్లితెరపై యాక్టివ్‌గా ఉంటున్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




