AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan: కోట్లు విలువైన భవనాన్ని కూతురికి గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్.. ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా ?..

నటనకు వయసుతో సంబంధం లేదని ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నాడు. 80 ఏళ్లు దాటిన వరుస సినిమాలతోపాటు.. రియాల్టీ షోలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి షోకు హోస్టింగ్ చేస్తున్నారు. ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అమితాబ్.. ఫ్యామిలీకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరికితే కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. కుమారుడు అభిషేక్ బచ్చన్, కూతురు శ్వేత నందా అంటే బిగ్ బీకి అమితమైన ప్రేమ అన్న సంగతి తెలిసిందే.

Amitabh Bachchan: కోట్లు విలువైన భవనాన్ని కూతురికి గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్.. ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా ?..
Amitabh Bachchan
Rajitha Chanti
|

Updated on: Nov 25, 2023 | 5:06 PM

Share

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. నటనకు వయసుతో సంబంధం లేదని ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నాడు. 80 ఏళ్లు దాటిన వరుస సినిమాలతోపాటు.. రియాల్టీ షోలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి షోకు హోస్టింగ్ చేస్తున్నారు. ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అమితాబ్.. ఫ్యామిలీకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరికితే కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. కుమారుడు అభిషేక్ బచ్చన్, కూతురు శ్వేత నందా అంటే బిగ్ బీకి అమితమైన ప్రేమ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పిల్లల బాగోగులను తనే చూసుకుంటారు. ఇంట్లో జరిగే ప్రతి వేడుకను తన కూతురు, కుమారుడుతో కలిసి జరుపుకుంటారు. అయితే తాజాగా అమితాబ్ తన కూతురికి కోట్లు విలువ చేసే భవనాన్ని బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం అమితాబ్ తమ కుమార్తె శ్వేతా నందాకు తమకు ఇష్టమైన జుహు బంగ్లాను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ఈ విలాసవంతమైన ఇల్లు 50 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ముంబైలోని అత్యంత ఖరీదైన జై జుహు ప్రాంతంలోగల బంగ్లా పేరు ప్రతీక్ష. ఈ భవనం అంటే అమితాబ్ కు చాలా ఇష్టం. తన తల్లిదండ్రులతో కలిసి అమితాబా ఇక్కడే ఉండేవాడు. అంతేకాకుండా ఐశ్వర్యల పెళ్లి కూడా అక్కడే జరిగింది. మొత్తం 674 చదరపు మీటర్లు, 890.47 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు ప్లాట్స్ లో విస్తరించి ఇంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by S (@shwetabachchan)

ఇదే కాకుండా అమితాబ్ కుటుంబానికి జల్సా, జనక్ అనే భవనాలు ఉన్నాయి. ఈ రెండు ఇళ్ల విలువ కోట్లలో ఉంది. బిగ్ బికి ఇష్టమైన జల్సా ఇల్లు జుహులోని జెడబ్ల్యు మారియట్ సమీపంలోని రెండు అంతస్తుల ఆస్తి. దీని విలువ రూ.100-120 కోట్లు ఉంటుందని సమాచారం. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ వివాహం 1973లో వివాహం చేసుకున్నారు. వీరికి శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్. శ్వేతా బచ్చన్ నిఖిల్ నందాను పెళ్లాడగా, ఐశ్వర్యరాయ్‌ని అభిషేక్ బచ్చన్‌గా వివాహం చేసుకున్నారు.

View this post on Instagram

A post shared by S (@shwetabachchan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.