Ali Fazal, Richa Chadha: బాలీవుడ్‌లో కొత్త సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కనున్న మరో ప్రేమ జంట.

Ali Fazal, Richa Chadha: సినీ పరిశ్రమలో వరస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న జంటలు.. ఒకొక్కరుగా పెళ్లి పీటలు..

Ali Fazal, Richa Chadha: బాలీవుడ్‌లో కొత్త సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కనున్న మరో ప్రేమ జంట.
Ali Fazal, Richa Chadha
Follow us
Surya Kala

|

Updated on: Dec 24, 2021 | 12:53 PM

Ali Fazal, Richa Chadha: సినీ పరిశ్రమలో వరస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న జంటలు.. ఒకొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కనున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా మరో ప్రేమ జంట వివాహ వేడెక్కి రెడీ అయింది. వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ నటి రిచా చద్దా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమలో మునిగి తేలుతూ.. చెట్టపట్టాలు వేసుకుని చక్కర్లు కొడుతున్నారు. అయితే ఈ జంట పక్షులు పెళ్లి చేసుకుని ఒక్కటిగా గత ఏడాది కావాల్సి ఉంది.అయితే కరోనా మహమ్మారి కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రిచా అలీ లు కొత్త ఏడాది  2022 మార్చిలో పెళ్లి పీటలు ఎక్కనున్నారనే టాక్ బీ టౌన్ లో వినిపిస్తోంది.

రిచా,అలీల పెళ్లి వేడుక సంబరాలు ముంబైతో పాటు ఢిల్లీలోనూ జరగనున్నాయని టాక్. అయితే కరోనా నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకలను అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, ముఖ్యమైన బంధువులు, అత్యంత సన్నిహితులను మాత్రమే పెళ్ళికి పిలవనున్నారనే టాక్.

మసాన్ చిత్రంతో గుర్తింపు పొందిన రిచా ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ హీరామండీ ’వెబ్‌సిరీస్‌లో కనిచనుంది. అలీ సైతం ఓ వైపు బాలీవుడ్ తో పాటు మరో వైపు హాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్టుల్లో సైతం నటిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by ali fazal (@alifazal9)

Also Read:  ఏపీలో పలు థియేటర్స్ క్లోజ్.. స్వచ్ఛందంగా కొన్ని.. సీజ్ చేయడంతో కొన్ని..