Salman Khan: అమ్మాయిల డ్రెస్సింగ్ విషయంలో సల్మాన్ చాలా స్ట్రిక్ట్.. సెట్లో అలాంటి డ్రెస్ వేసుకోవాల్సిందే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
తాజాగా ఈ సినిమా ప్రచారం లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ పాలక్ తివారీ షాకింగ్ కామెంట్స్ చేసింది. సల్మాన్ ఖాన్ తో నటించాలంటే.. సెట్ లో అమ్మాయలకు కొన్ని రూల్స్ ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా డ్రెస్సింగ్ పై కఠినమైన నిబంధన ఉందని తెలిపింది. దీంతో పాలక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

బాలీవుడ్ సల్మాన్ ఖాన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సౌత్ టూ నార్త్ సల్లూభాయ్ అంటే ఇష్టపడని వారుండరు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా.. విక్టరీ వెంకటేష్, షెహనాజ్ గిల్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ప్రచారం లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ పాలక్ తివారీ షాకింగ్ కామెంట్స్ చేసింది. సల్మాన్ ఖాన్ తో నటించాలంటే.. సెట్ లో అమ్మాయలకు కొన్ని రూల్స్ ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా డ్రెస్సింగ్ పై కఠినమైన నిబంధన ఉందని తెలిపింది. దీంతో పాలక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
అంతిమ్.. ది ఫైనల్ ట్రూత్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది పాలక్. ప్రస్తుతం ఆమె సల్మాన్ నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది. అంతిమ్ సినిమా సెట్ లో సల్మాన్ తో కలిసి నటిస్తున్నప్పుడు తాను చూసిన విషయాలను పంచుకుంది. మహిళలు ఎలా దుస్తులు ధరించాలనే విషయంలో ఆయనకు నిబంధన ఉందని తెలిపింది. సెట్ లో ఉండే మహిళలంతా నెక్ లైన్ కు తక్కువ కాకుండా దుస్తులు ధరించాలనే రూల్ పెట్టాడని.. తనతోపాటు సెట్ లో ఉండే అమ్మాయింతా సరిగ్గా డ్రెస్ వేసుకోవాలని సల్మాన్ కోరేవాడని పాలక్ చెప్పింది. “సల్మాన్ ఒక సంప్రదాయవాది.. తనతో పనిచేసే మహిళల భద్రత కోసం ప్రయత్నిస్తాడు” అంటూ సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది.




సల్మాన్ తో షూటింగ్ అనగానే తన తల్లి సంతోషించిందని.. ఎప్పుడు తనపై దుస్తులపై కంప్లైంట్ చేస్తూ ఉంటుందని.. సల్మాన్ రూల్స్ విన్నాక ఆమె ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చింది. సెట్ లో అబ్బాయిలు ఎంత మంది ఉన్నా అతను నమ్మడని.. నిత్యం మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటాడని తెలిపింది. పాలక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో సల్మాన్ రూల్స్.. అతని ఆలోచన విధానాలు తెలిసి గర్ల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
