Kartik Aaryan: రూ. 9 కోట్ల భారీ ఆఫర్.. అయినా యాడ్ చేయనని చెప్పేసిన హీరో.. కారణం ఏంటంటే..
ఇటీవలే పొగాకు కంపెనీకి ప్రకటనలో నటించనంటూ కోట్ల ఆఫర్ తిరస్కరించారు అల్లు అర్జున్. తాజాగా అదే బాటలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) సైతం నడుస్తున్నారు.

స్టార్ హీరోహీరోయిన్స్ పలు బ్రాండ్లకు అంబాసిడర్స్‌గా ఉండడం.. కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేయడం సర్వసాధారణం. చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ వరకు ప్రతి ఉత్పత్తి గురించి యాడ్స్ చేస్తుంటారు. ఇందుకు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటారు. కానీ పలు బ్రాండ్స్ ప్రమోట్ చేయడానికి సెలబ్రెటీలు ఇప్పుడు నో చెప్పేస్తున్నారు. ఇప్పటికే సాయి పల్లవి, అల్లు అర్జున్, బాలకృష్ణ వంటి స్టార్స్ తమ వరకు వచ్చిన ఆఫర్లను నిర్మోహమాటంగా రిజెక్ట్ చేశారు. ఇటీవలే పొగాకు కంపెనీకి ప్రకటనలో నటించనంటూ కోట్ల ఆఫర్ తిరస్కరించారు అల్లు అర్జున్. తాజాగా అదే బాటలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) సైతం నడుస్తున్నారు. తనవరకు వచ్చిన రూ. 9 కోట్లు డీల్ ఆఫర్ ను రిజెక్ట్ చేసి షాకిచ్చారు.
అసలు విషయమేంటంటే.. పాన్ మసాలా ప్రకటన చేయాలంటూ కార్తీక్ కు రూ.8-9 కోట్ల డీల్ ఆఫర్ వచ్చింది. తనను అభిమానించే ప్రజలు మత్తు కలిగించే ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు తాను ప్రోత్సహించనంటూ కార్తీక్ ఈ ఆఫర్ నో చెప్పినట్లుగా సన్నిహితులు తెలిపారు. ఇటీవలే భూల్ భూలయ్య 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరోకు ఇన్ స్టాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. పాపులర్ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ పాన్ మసాలా ప్రకటన కోసం కార్తిక్ 9 కోట్ల ఆఫర్ తిరస్కరించినట్లు తెలిపాడు. గతంలో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ లు పొగాకు సంస్థకు ప్రకటనలో నటించారు. దీంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.




View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.