Samantha: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సామ్! ఒక్కో సినిమా కోసం ఏకంగా అన్ని కోట్లా?
ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సమంత మీడియం రేంజ్ సినిమాలకు సింపుల్‌గా నో చెప్పేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2తో నేషనల్ లెవల్‌లో పాపులర్ కావటంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తోంది.
ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సమంత మీడియం రేంజ్ సినిమాలకు సింపుల్‌గా నో చెప్పేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2తో నేషనల్ లెవల్‌లో పాపులర్ కావటంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తోంది. ప్రజెంట్ సామ్ ఫుల్ ఫామ్‌లో ఉండడంతో పారితోషికం ఎంతైనా ఓకే అంటున్నారు దర్శక నిర్మాతలు. సమంత కెరీర్ ది ఫ్యామిలీ మ్యాన్ 2కి ముందు.. తరువాత అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ వెబ్ సిరీస్‌తో సామ్ నేషనల్ లెవల్‌లో పాపులర్ కావటంతో నార్త్ మేకర్స్ కూడా ఈ బ్యూటీ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. అయితే సమంత మాత్రం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
సమంత లీడ్ రోల్‌లో నటించిన పాన్ ఇండియా మైథలాజికల్ మూవీ శాకుంతలం, యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న యశోద సినిమాలు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. రెండూ పాన్ ఇండియా రిలీజ్‌లే కావటంతో సమంత నేషనల్ స్టార్ అని ఫిక్స్ అయ్యారు ఇండస్ట్రీ జనాలు. ఇదే సమయంలో తన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉంది సామ్. తనతో సినిమా అంటే 5 కోట్ల పేమెంట్ ఇవ్వాల్సిందే అని తెగేసి చెబుతోందట సమంత. ఈ కండిషన్‌కు నో అన్న కారణంతోనే రీసెంట్‌గా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ప్రజెంట్ సమంత క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ మాత్రం పేమెంట్ పెద్ద విషయమేం కాదంటున్నారు సినీ విశ్లేషకులు. ఇంకా పాన్ ఇండియా సినిమాలేవి రిలీజ్ కాలేదు కాబట్టి… సమంత రెమ్యూనరేషన్ 5 కోట్ల మార్క్ దగ్గరే ఉంది. రిలీజ్‌కు రెడీ అవుతున్న రెండు సినిమాల్లో ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆ తరువాత సమంత పారితోషికం మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉందని లెక్కలేస్తున్నారు.
– సతీష్, టీవీ9 ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..