AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Alikhan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్..

ముంబై లోని బాంద్రాలో తన నివాసంలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. బంగ్లాదేశ్‌కు చెందిన దొంగ షరీఫుల్‌ ఇస్లాం సైఫ్‌ నివాసం లోకి చొరబడి దాడి చేశాడు.. కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్‌కు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స జరిగింది.

Saif Alikhan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్..
Saif Ali Khan
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2025 | 4:02 PM

Share

ముంబై లోని బాంద్రాలో తన నివాసంలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. బంగ్లాదేశ్‌కు చెందిన దొంగ షరీఫుల్‌ ఇస్లాం సైఫ్‌ నివాసంలోకి చొరబడి దాడి చేసిన సంగతి తెలిసిందే. జనవరి 16న అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. అదే రోజు తెల్లవారుజామున సైఫ్ తనయుడు తైమూర్ తన తండ్రిని ఆటోలో లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్‌కు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స జరిగింది. సైఫ్‌ భార్య కరీనా కపూర్‌ కూడా లీలావతి ఆస్పత్రికి వచ్చారు. సైఫ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అతడు మరో వారం రోజులపాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు వైద్యులు. అలాగే అతడి గాయాలు ఇంకా మానలేదు..కాబట్టి అతడికి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేందుకు కొంతకాలం పాటు కుటుంబసభ్యులతోపాటు బయట వ్యక్తులు సైతం దూరంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. మరికాసేపట్లో సైఫ్ ను తన ఇంటికి తీసుకెళ్లనున్నారు వైద్యులు. ప్రస్తుతం సైఫ్ వెంట ఆయన తల్ల, నటి షర్మిలా టాగూర్ ఉన్నారు. అలాగే సైఫ్ భార్య కరీనా కపూర్, కుమార్తె సారా అలీఖాన్, కుమారుడు ఇబ్రహీం ఆసుపత్రి నుంచి కొంతసేపటికే ఇంటికి వెళ్లారు.

ప్రస్తుతం సైఫ్ మాట్లాడగలడని.. కానీ అతడు పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల పడుతుందని వైద్యులు తెలిపారు. సైఫ్ వీపు భాగంలో కత్తి రెండున్నర అంచులు విరిగిపోవడంతో శస్త్ర చికిత్స చేసి కత్తిని తొలగించారు వైద్యులు. సైఫ్ పూర్తిగా కోలుకునేవరకు అతడు బరువులు ఎత్తడం, జిమ్ చేయడం, షూటింగ్ మానుకోవాలని వైద్యులు సూచించారు. సైఫ్ ఏ మందులు ఎప్పుడు తీసుకోవాలి? అతని మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ని లీలావతి హాస్పిటల్ బృందం కూడా సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా, అతను ఎప్పటికప్పుడు సాధారణ శస్త్రచికిత్స వైద్యుడికి తన గాయం ఎంతవరకు నయం అయ్యిందో కూడా చూపించాలని తెలిపారు.

మేఘాలయా మీదు షరీఫుల్‌ ఇస్లాం భారత్‌ లోకి చొరబడినట్టు తెలుస్తోంది. దొంగ ఆధార్‌కార్డుతో అతడు భారత్‌లో నివాసం ఉంటున్నాడు. థానేలో మొబైల్‌ లొకేషన్ ఆధారంగా షరీఫుల్‌ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..