Ranbir Kapoor: పుష్ప మూవీపై రణబీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అల్లు అర్జున్ పాత్ర పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

పక్కా ఊరమాస్ స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో బన్నీ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.

Ranbir Kapoor: పుష్ప మూవీపై రణబీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అల్లు అర్జున్ పాత్ర పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Allu Arjun, Ranbir Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 27, 2023 | 10:16 AM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అంతేకాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా.. రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబట్టారు. పక్కా ఊరమాస్ స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో బన్నీ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.

ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్‏కు అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటించిన రణబీర్ తన గతేడాది తనకు నచ్చిన సినిమాల గురించి చెప్పుకొచ్చారు. అలాగే తనకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పాత్రలో నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. “గత రెండేళ్ళలో నటన పరంగా నన్ను మూడు చిత్రాలు ప్రభావితం చేశాయి. పుష్పలో అల్లు అర్జున్, గంగూబాయిలో ఆలియా భట్ పాత్ర.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాత్రలు నాపై ప్రభావం చూపించాయి. ఒక ప్రేక్షకుడిగా, నటుడిగా కూడా నేను వావ్, ఇలాంటి క్యారెక్టర్‌ వచ్చి ఉంటే చాలా బాగుండేది. అని చాలా సార్లు అనుకున్నాను. ” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తాను గతంలో పాకిస్తానీ చిత్రాలు చేయాలనుందని చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

“నేను వెళ్లిన కార్యక్రమంలో చాలా మంది పాకిస్తానీ చిత్ర నిర్మాతలు.. దర్శకులు పాల్గొన్నారు. మంచి కథలు ఉంటే పాకిస్తాన్ చిత్రాల్లో నటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ? అని వారు నన్ను ప్రశ్నిస్తే.. సినిమాకు.. కళకు ఎలాంటి హద్దులు ఉండవని అనుకుంటున్నాను.. అందుకే ఆ సినిమాల్లో నటిస్తానని చెప్పాను.. కానీ నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కిస్తోన్న యానిమల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్