Ayyappanum Koshiyum: ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నుంచి తప్పుకున్న అభిషేక్ బచ్చన్.. ఇప్పుడు జాన్ అబ్రహంకి జోడి ఎవరు..?
Ayyappanum Koshiyum: అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం కలిసి చాలా సినిమాలు చేశారు. ఇద్దరూ దోస్తానా, ధూమ్‌లో కలిసి పనిచేశారు.
Ayyappanum Koshiyum: అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం కలిసి చాలా సినిమాలు చేశారు. ఇద్దరూ దోస్తానా, ధూమ్‌లో కలిసి పనిచేశారు. అయితే వీరిద్దరు కలిసి మలయాళ చిత్రం అయ్యప్పనం కోశియుమ్ రీమేక్‌లో కలిసి నటించాల్సి ఉంది. జాన్‌తో కలిసి పనిచేయడానికి అభిషేక్ చాలా ఉత్సాహంగానే ఉన్నాడు. అయితే ఇంతలో మరో వార్త బయటికి వచ్చింది. అభిషేక్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. పింక్‌విల్లా నివేదిక ప్రకారం.. అభిషేక్ బచ్చన్ ఇకపై ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ భాగం కాదు. మరోవైపు జాన్ అబ్రహం, అభిషేక్ కలిసి నటిస్తున్నారన్ని సంగతి తెలిసి అభిమానులు చాలా సంతోషించారు. దర్శకుడు జగన్ శక్తి కూడా ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభిస్తామని ప్రకటన కూడా చేశారు. కానీ ఇంతలో ఇలా జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అభిషేక్ స్థానంలో మరొకరిని వెతుకుతోంది నివేదికల ప్రకారం అయ్యప్పనుం కోశియుమ్ బృందం అభిషేక్ బచ్చన్ స్థానంలో మరొకరిని వెతుకుతోంది. ఇటీవల అభిషేక్ బచ్చన్ చెన్నైలో షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. అతడి చేతికి బలమైన గాయం అయింది. అతను తన ఫోటోను షేర్ చేయడం ద్వారా దీని గురించి సమాచారం అందించాడు. చెన్నైలో గత బుధవారం కొత్త సినిమా సెట్‌లో ప్రమాదం జరిగిందన్నారు. దీని కారణంగా కుడి చేతికి ఫ్రాక్చర్ ఏర్పడిందన్నారు. దాన్ని సరిచేయడానికి శస్త్రచికిత్స అవసరం కాబట్టి వెంటనే ముంబై వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నాని తెలిపారు. అందుకే అయ్యప్పనుం కోశియుమ్ నుంచి తప్పుకున్నట్లు వివరణ ఇచ్చాడు. అభిషేక్ బచ్చన్ చివరిగా ది బిగ్ బుల్ చిత్రంలో కనిపించారు. 1992 స్కామ్ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. ఈ సినిమా OTT ప్లాట్‌ఫామ్‌పై విడుదలైంది. ఈ సినిమాలో అభిషేక్ బాగా నటించారు. ప్రేక్షకులు చాలా ప్రశంసించారు.