- Telugu News Photo Gallery Spiritual photos Special Recipes For Gokulashtami Krishnashtami Sri Krishna Jayanti
Krishnashtami 2021: కృష్ణాష్టమిరోజున కన్నయ్యకు ఇష్టమైన పదార్ధాలతో నైవేద్య పెట్టండి.. కృపకు పాత్రులుకండి
Krishnashtami: కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమని అంటారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన ఈరోజుని కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. ఈరోజున భక్తులు పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టి.. ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. . అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఏ ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టాలి అనే వాటిని ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Aug 29, 2021 | 10:15 AM

కృష్ణుడికి అటుకులు అంటే అత్యంత ప్రీతికరమని పురాణాలకథనం.. అందుకని కృష్ణామినాడు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా చాలా మంది అటుకులు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. లేదంటే.. కొంచెం పంచదార పాకం పట్టి అందులో వేయించిన అటుకులు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డుల్లా చుట్టుకుని వాటిని నైవేద్యంగా పెడతారు.

ఉత్తరాదిలో పాటు దక్షిణాదిలో కూడా ఎక్కువగా పాయసాన్ని శ్రీకృష్ణుడికి కృష్ణాష్టమికి నైవేద్యం సమర్పిస్తారు. సేమ్యా, లేదా బియ్యంతో చేసే ఈ పాయసం లో యాలుకల పొడి, డ్రై ఫ్రూట్స్ అదనపు టెస్టుని ఇస్తాయి.

కృష్ణాష్టమినాడు ఉత్తరాదిలో ఎక్కువ చేసే పిండి వంటకం అప్పాలు. వీటిని బియ్యం పిండి, బెల్లంతో కలిపి తయారు చేస్తారు.

కన్నయ్యకు వెన్న దొంగ అనే ముద్దు పేరు ఉంది. అంతగా వెన్నని ఇష్టపడతాడు శ్రీకృష్ణుడు.. అందుకనే శ్రీ కృష్ణాష్టమి ఈరోజున తాజా వెన్నలో కొంచెం పంచదార వేసి నైవేద్యంగా పెడతారు.

హిందువుల ప్రతి పండగలోనూ పంచామృతాలది ప్రత్యేక స్థానం.. కృష్ణాష్టమి రోజున కూడా తప్పకుండా పంచామృతాలు నైవేద్యంగా పెడతారు. తాజా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, తులసి ఆకులు , వెన్నని కలిపి దేవుడికి నైవేద్యంగా పెడతారు.

నిజానికి చిన్ని కన్నయ్యకు శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజున 102 రకాల పిండివంటలు చేయాలని ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, శనగ పప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు




