AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ira Khan: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన స్టార్‌ హీరో కుమార్తె.. వెడ్డింగ్‌ వెన్యూ, గెస్టుల వివరాలివే

ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా రాజస్థాన్‌లోని ప్రఖ్యాత ఉదయపూర్‌ ప్యాలెస్‌ వేదికగా వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా షురూ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బి-టౌన్‌లో మరో పెళ్లి వార్త వినిపిస్తోంది. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లాగానే బాలీవుడ్

Ira Khan: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన స్టార్‌ హీరో కుమార్తె.. వెడ్డింగ్‌ వెన్యూ, గెస్టుల వివరాలివే
Ira Khan, Nupur Shikhare
Basha Shek
|

Updated on: Sep 18, 2023 | 7:04 PM

Share

ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా రాజస్థాన్‌లోని ప్రఖ్యాత ఉదయపూర్‌ ప్యాలెస్‌ వేదికగా వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా షురూ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బి-టౌన్‌లో మరో పెళ్లి వార్త వినిపిస్తోంది. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లాగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి కూడా ఉదయపూర్‌లోనే జరగనుందట. ఇక్కడే తన ప్రియుడు నుపుర్ శిఖరేతో పెళ్లిపీటలెక్కనుందట ఈ స్టార్‌ కిడ్‌. ఆమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన ప్రియుడు నూపుర్ శిఖరేతో గతేడాది నిశ్చితార్థం చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఇరా ఖాన్, నుపుర్ శిఖరేల వివాహానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, ఉదయపూర్‌లో ఇరా- నుపుర్‌ల వివాహానికి అతిథి జాబితా కూడా రెడీ అయ్యిందని సమాచారం. ఇక ఇరా పెళ్లి డేట్‌పై సందిగ్ధం కొనసాగుతోంది. కొందరేమో వచ్చే నెలలోనే ఆమె వివాహం జరుగుతుందని చెబుతుంటే, సన్నిహితులు, స్నేహితులు మాత్రం వచ్చే ఏడాదిలోనే పెళ్లిపీటలెక్కుతారంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఆమిర్‌ ఖాన్‌ – రీనాదత్త దంపతుల గారాలపట్టిగా ఇరా ఖాన్‌ బాలీవుడ్ సినీ ప్రేమికులకు సుపరిచితమే. సినిమాలు చేయకున్నా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందీ ముద్దుగుమ్మ. గతంలో మానసిక సమస్యలతో సతమతమైన ఇరా తరచూ దీనిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది. తద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. ఇక నుపుర్‌ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా అమిర్‌ఖాన్‌కు పర్సనల్ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఇరా సైతం అతని వద్దే ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే వీరి మధ్య స్నేహం చిగురించింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు పెద్దల అంగీకారంతో గతేడాదే ఉంగరాలు మార్చుకున్నారీ లవ్లీ కపుల్‌. కాగా ఇరా ఖాన్, నుపుర్ శిఖరే మొదట కోర్టు వివాహం చేసుకోబోతున్నారట. ఆ తర్వాత మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరుగుతాట. అమిర్‌ ఖాన్‌ కూడా తన కూతురు పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటున్నారట.

ప్రియుడితో ఇరా ఖాన్.. 

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..