Katrina Kaif- Vicky Kaushal: ఒక్కటైన బాలీవుడ్‌ ప్రేమజంట.. వేడుకగా విక్ట్రీనాల వివాహం..

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచారు

Katrina Kaif- Vicky Kaushal: ఒక్కటైన బాలీవుడ్‌ ప్రేమజంట..  వేడుకగా విక్ట్రీనాల వివాహం..
Follow us

|

Updated on: Dec 09, 2021 | 9:01 PM

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచారు. గురువారం సాయంత్రం రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ అనే విలాసవంతమైన హోటల్‌లో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. హిందూ- పంజాబీ సంప్రదాయ ప్రకారం కత్రినా, విక్కీలు దాంపత్య బంధంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి డిజైన్‌ చేసిన ప్రత్యేకమైన లెహెంగాలో కత్రినా అందంగా ముస్తాబు కాగా..వరుడు విక్కీ కౌశల్‌ బంగారు వర్ణపు దుస్తుల్లో మెరిసిపోయాడు. కాగా విక్ట్రీనా పెళ్లి ఫొటోలు, వీడియోలు, పుటేజీ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే వీరి వివాహానికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియోలు అధికారికంగా బయటకు రావడం లేదు. అయితే పెళ్లి వేడుక అనంతరం వరుడు విక్కీ కౌశల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెళ్లి ఫొటోలను పంచుకున్నాడు. జీవితంలో తమ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదం కావాలని అందులో కోరాడు.

ఇక ప్రి వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా సంగీత్‌, మెహెందీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. ఇక మెహెందీ వేడుకల్లో కత్రినా బంగారు అంచుతో కూడిన పాస్టెల్ ఆకుపచ్చ కంజీవరం చీరను ధరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి . కాగా విక్ర్టీనా పెళ్లి కోసం రూ.4.5 లక్షల స్పెషల్‌ కేక్‌ను తెప్పించారట. ఇక అతిథుల కోసం ఇటాలియన్‌ వంటకాలతో పాటు రాజస్థానీ స్పెషల్‌ వంటకాలతో పాటు విదేశీ అతిథుల కోసం పాన్‌-ఆసియన్‌ వంటకాలను మెనూలో ఉంచారట. ఇక పెళ్లి ముహూర్తానికి ముందు ఓ వింటేజ్‌ కారులో విక్కీనీ ఘనంగా ఊరేగించారని తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్‌తో పాటు అలియా భట్‌, సారా అలీఖాన్‌, అలియాభట్‌ తదితర బాలీవుడ్‌ ప్రముఖులు కనిపించారు. వీరందరూ విక్ట్రీనా వివాహానికి హాజరయ్యేందుకే వెళ్లారని తెలుస్తోంది. కాగా నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులు, సినీ దర్శకుడు కబీర్ ఖాన్ , ఆమె భార్య మినీ మాథుర్, నటి శార్వారీ బాగ్, రోహిత్ శెట్టి నిన్ననే హోటల్‌కు చేరుకున్నారు.

Also Read:

SS Rajamouli RRR: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కు భారీ స్పందన.. చిత్ర యూనిట్ ఏమంటున్నారు అంటే..?(లైవ్ వీడియో)

Akhanda: బాక్స్ ఆఫీస్‌ను దున్నేస్తున్న బాలయ్య.. కలెక్షన్ల ఊచకోత.. సక్సెస్ సంబరాల్లో అఖండ టీం..(వీడియో)

Sharwanand : అప్పటికి ఇప్పటికి ఆమె అంతే అందంగా ఉంది.. హీరోయిన్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా