Sharwanand : అప్పటికి ఇప్పటికి ఆమె అంతే అందంగా ఉంది.. హీరోయిన్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్

'గమనం సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.

Sharwanand : అప్పటికి ఇప్పటికి ఆమె అంతే అందంగా ఉంది.. హీరోయిన్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్
Follow us

|

Updated on: Dec 09, 2021 | 6:50 PM

Sharwanand : ‘గమనం సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను పెంచారు. ఈ సందర్భంగా రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శర్వానంద్, దేవా కట్టా ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘బాబా గారి వల్లే నేను ఇక్కడకు వచ్చాను. మా ప్రయాణం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాతో మొదలైంది. ఆయన నిర్మాతగా మారతానని చెప్పినప్పుడు అవసరమా? అని అనిపించింది. కానీ కథ విన్నాక ఇదెంతో గొప్పదని తెలిసింది అన్నారు శర్వా. గమ్యం, ప్రస్థానం, జర్నీ, గమనం అన్నీ కూడా ట్రావెల్ మీదే ఉన్నాయి. ఇళయరాజా గారితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది కానీ అది కొందరికే కుదురుతుంది అన్నారు. శివ ఓ ప్రామిసింగ్ యాక్టర్. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు అన్నాడు శర్వా.  ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. డిసెంబర్ 10న గమనం రాబోతోంది. అందరూ సినిమాను చూడండి. శ్రియా, నేను ఎంతో కాలం నుంచి ఫ్రెండ్స్. సంతోషం సినిమా నుంచి ఇప్పటికీ ఇలానే ఉంది. మంచి పాత్రలను ఎంచుకంటూ ముందుకు వెళ్తుంది’. ఇద్దరం కలిసి నువ్వా నేనా సినిమా చేశాం.. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అని అన్నాడు శర్వానంద్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Genelia Deshmukh: సెకండ్ ఇన్నింగ్స్‌ షురూ చేసిన హాసినీ.. మరాఠీ చిత్రం కోసం మళ్లీ మేకప్‌ వేసుకోనున్న జెనీలియా..

Lance Naik Sai Teja: అమరజవాను సాయి తేజ్ కుటుంబానికి మంచు విష్ణు బాసట.. పిల్లల చదువు ఖర్చులను భరిస్తామంటూ..

RRR Movie Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పై సెలబ్రెటీల రియాక్షన్స్.. మాటలు రావడంలేదు అంటూ..