83 Movie: అమ్మా ప్రపంచకప్ గెలిచేశాం.. 83 సినిమా సక్సెస్‌పై రణ్‌వీర్ సింగ్ ఎమోషనల్ పోస్ట్..
భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరూ ఈ క్రీడను ఇష్టపడతారు. ఈనేపథ్యంలో భారత క్రికెట్ గమనాన్ని పూర్తిగా మార్చివేసిన 1983
భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరూ ఈ క్రీడను ఇష్టపడతారు. ఈనేపథ్యంలో భారత క్రికెట్ గమనాన్ని పూర్తిగా మార్చివేసిన 1983 ప్రపంచకప్ విశేషాలను ’83’ సినిమాతో వెండితెరపై ఆవిష్కృతం చేశాడు కబీర్ ఖాన్. టీమిండియాకు తొలి ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిన అప్పటి కెప్టెన్, లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించాడు. అతని సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొణె నటించింది. సినిమా అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం నేడు (డిసెంబర్24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ వరల్డ్ కప్ అసలైనదే.. ’83’ సినిమాలో కపిల్ పాత్రలో ఇట్టే ఒదిగిపోయాడు రణ్‌వీర్. హెయిర్ స్టైల్‌మొదలుకుని కపిల్ క్రికెట్ ఆడే విధానం వరకు అచ్చుగుద్దినట్లు దింపేశాడు. అందుకు తగ్గట్లే సినిమా చూసిన ప్రేక్షకులు రణ్‌వీర్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడీ హ్యాండ్సమ్ హీరో. ‘ హమ్ జీత్ గయే ముమ్మా (అమ్మా మేము గెలిచాం)’ అని పోస్ట్ షేర్ చేసిన రణ్‌వీర్.. అందులో అతని తల్లి (అంజు భవ్నాని) 1983 ప్రపంచ కప్ పట్టుకుని ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తన తల్లి చేతిలో ఉన్న ప్రపంచకప్ అసలైనదే అంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు రణ్‌వీర్.
’83’ సినిమా చిత్రీకరణలో భాగంగా లండన్‌లో షూటింగ్ చేసేటప్పుడు లార్డ్స్ స్టేడియం నిర్వాహకులను అడిగి మరీ ఈ ప్రుడెన్షియల్ కప్ (1983లో వరల్డ్ కప్ పేరు) తీసుకున్నాడట డైరెక్టర్ కబీర్ ఖాన్. ‘మేం లండన్‌లో లార్డ్స్ స్టేడియం(1983 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక) లో ఐదు రోజుల పాటు షూటింగ్ చేశాం. అక్కడి డ్రెస్సింగ్ రూమ్‌లు, లాకర్ల గదులోకి వెళ్లి చూశాం. ఈక్రమంలోనే కపిల్‌కు ప్రపంచ కప్ ప్రదానం చేసిన బాల్కనీలోకి వెళ్లాం. అప్పుడు స్టేడియం నిర్వాహకులు వరల్డ్ కప్‌ను తీసుకొచ్చి మాకు అందించారు’ అని కబీర్ చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
Also Read:
Vadivelu Covid Positive: తమిళ నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స..
చిన్నతనంలో తన స్నేహితుడితో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?
Fertilisers: అన్నదాతలకు శుభవార్త.. విదేశీ ఎరువుల రాయితీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం !