”అది వారి కర్మ.. నీది కాదు”.. సుశాంత్ మృతిపై దర్శకుడి సంచలన ట్వీట్
బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో యావత్ సినీలోకం ఉలిక్కిపడింది.
బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో యావత్ సినీలోకం ఉలిక్కిపడింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఓ అద్భుత నటుడు ఇలా చేయకుండా ఉండాల్సిందంటూ అందరూ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. కాగా సుశాంత్ మృతిపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్ సంచలన ట్వీట్ చేశారు.
”నీ జీవితంలో నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు తెలుసు. నిన్ను చెడ్డవాడిగా చిత్రీకరించి, కిందికి లాగాలని ప్రయత్నించిన వారి కథలు నాకు తెలుసు. వారి వలన నా భుజంపై ముఖం వాల్చి నువ్వు ఏడ్చావు. ఆరు నెలలుగా నేను నీతో ఉండాల్సింది. నువ్వు కూడా నా దగ్గరకు రావాల్సింది. ఏం జరిగినా అది వారి కర్మ. నీది కాదు” అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు. కాగా సుశాంత్ హీరోగా శేఖర్ కపూర్ ‘పాని’ అనే చిత్రాన్ని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది.
Read This Story Also: మోక్షఙ్ఞ బాధ్యతలు తీసుకున్న జక్కన్న.. కానీ..!
I knew the pain you were going through. I knew the story of the people that let you down so bad that you would weep on my shoulder. I wish Iwas around the last 6 months. I wish you had reached out to me. What happened to you was their Karma. Not yours. #SushantSinghRajput
— Shekhar Kapur (@shekharkapur) June 15, 2020