AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Sree: నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు.. బిగ్ బాస్ అశ్విని కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అశ్విని శ్రీ ఒకరు. తెలంగాణకు చెందిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. విజేతగా నిలవకున్నా తన అందం, ఆట, మాట తీరుతో ఆడియెన్స్ మన్ననలు అందుకుంది.

Ashwini Sree: నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు.. బిగ్ బాస్ అశ్విని కామెంట్స్ వైరల్
Bigg Boss Telugu Fame Ashwini Sree
Basha Shek
|

Updated on: Nov 01, 2026 | 6:01 PM

Share

బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి అశ్విని శ్రీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాలు చేసిన ఈ అమ్మడు బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. విజేతగా నిలవకున్నా తన అందం, క్యూట్ నెస్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు టీవీ షోల్లో సందడి చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే అశ్విని శ్రీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తనకు కాబోయేవాడి గురించి మనసు విప్పి మాట్లాడింది. నిన్ను చేసుకునేవాడు ఎలా ఉండాలన్న ప్రశ్నకు అశ్విని శ్రీ ఇలా చెప్పుకొచ్చింది.

‘గ్లామర్ పరంగా నాకు కాబోయే భర్త ఎలా ఉన్న పర్లేదు. వాడు నల్లగా ఉన్నా.. చండాలంగా ఉన్నా నాకు ఓకే. కానీ అతనికి మంచి మనసు ఉంటే చాలు. అతనికి డబ్బులు ఉన్నాయా? లేదా?అన్నది కూడా నాకు అనవసరం. ప్రస్తుతం నాకెవ్వరూ బాయ్ ఫ్రెండ్స్ లేరు. కానీ నన్ను చాలా మంది ట్రై చేస్తున్నారని తెలుసు. అయితే వారు నా మనసుకు కూడా నచ్చాలి కదా. ఈ రోజుల్లో అమ్మాయిలను వెంటపడని అబ్బాయిలు ఎవరు ఉంటారు. నాలాంటి అందమైన అమ్మాయికి ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. నన్ను బాగా చూసుకునే వాడు దొరికితే చాలు. ‍అతన్ని నేనే పోషిస్తాను’ అశ్విని శ్రీ చెప్పుకొచ్చింది. ఈ వీడియో పాతది అయినప్పటికీ ఇప్పుడు నెట్టంట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అన్నదానం కార్యక్రమంలో బిగ్ బాస్ అశ్విని శ్రీ..

అశ్విని శ్రీ కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించింది. సహాయక నటిగా మెప్పించింది. సర్దార్ గబ్బర్ సింగ్, రాజా ది గ్రేట్, బీటెక్ బాబులు, అమీర్ పేటలో తదితర చిత్రాల్లో నటించింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ సీరియల్స్‌లో కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us