Bigg Boss Telugu 10: టీవీ షోలో మిస్సింగ్! బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డుగా ఆ సీరియల్ హీరోయిన్ ఎంట్రీ ఫిక్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ షో ప్రారంభమై దాదాపు నెలవుతోంది. ఈ నేపథ్యంలో హౌస్ లోకి వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్ల ఎంట్రీ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో ఒక సీరియల్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని సమాచారం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. నాలుగో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఇక మొదటి వారం ఛైత్ర ఎలిమినేట్ కాగా రెండో వారం కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక మూడో వారం ఎలిమినేషన్ జరగలేదు. అయితే నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. దీంతో ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో బలమైన పోటీని పెంచేందుకు నిర్వాహకులు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐదో వారం లేదా ఆరో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే వారి లిస్టులో ప్రముఖ బుల్లితెర నటి కావ్యశ్రీ పేరు గట్టిగా వినిపిస్తోంది. బుల్లితెరపై ఈ అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 10 తెలుగులోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జోరందుకుంది.
కాగా బిగ్ బాస్ పదో సీజన్ ప్రారంభంలోనూ కావ్యశ్రీ మెయిన్ కంటెస్టెంట్ గా ఉందని ప్రచారం గట్టిగా జరిగింది. అంతకు ముందు సీజన్లలోనూ ఇలాంటి టాకే వినిపించింది. అయితే కావ్యశ్రీ మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టలేదు. బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లోకి కూడా ఈ బుల్లితెర బ్యూటీ రాకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు.ఇదే సమయంలో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రారంభమైన చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె కుకింగ్ కామెడీ షోలోకి కావ్య ఎంట్రీ ఇచ్చింది. యాదమ్మ రాజుకు జోడీగా ఆమె ఈ షోలో పార్టిసిపేట్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ చేసిన చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె ప్రోమోలో కావ్య కనిపించలేదు. ఆమె ప్లేసులో యాదమ్మ రాజుకు జోడీగా యష్మి వచ్చింది. దీంతో కావ్య ఎక్కడ? అని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ గా కావ్యశ్రీ ఫిక్స్ అయ్యిందని అందుకే ఓటీటీ షోకు ఆమె గుడ్ బై చెప్పేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
కావ్య శ్రీ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




