AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా.. మహేష్ బాబు దగ్గరకు..! కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా.. మహేష్ బాబు దగ్గరకు..! కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్
Ntr, Maheshbabu
Rajeev Rayala
|

Updated on: Oct 02, 2026 | 12:29 PM

Share

ఒక సినిమా కోసం దర్శకుడు ముందుగా ఒక హీరోను అనుకోవడం.. కథలో మార్పులు రావడంతో ఆ ప్రాజెక్ట్ మరో హీరో దగ్గరకు వెళ్లడం, లేదా ఆ హీరో బిజీగా ఉంటే మరో హీరోతో సినిమా చేయడం లాంటివి సినిమా రంగంలో కొత్తేమీకాదు. కానీ ఆ సినిమా పెద్ద స్టార్ నటించినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే ఈ విషయం మరింత చర్చకు వస్తుంది. మహేష్ బాబు నటించిన ఓ సినిమా విషయంలో ఇలాంటిదే జరిగిందట. మహేష్ చేసిన ఆ డిజాస్టర్ సినిమా ముందుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిందట.. ఆయన బిజీగా ఉండటంతో ఫైనల్ గా మహేష్ బాబు చేశారట.. కట్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్.. ఆ సినిమా మరేదో కాదు బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం 2016లో విడుదలైంది. కుటుంబ సంబంధాలు, బంధాలు, మనుషుల మధ్య అనుబంధాలను ప్రధానంగా తీసుకుని ఈ కథ రూపొందింది.

ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఆత్మహత్యకు ప్రయత్నించింది.. ఇప్పుడు ఇలా

అయితే ఈ కథను మొదట జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పారట. దర్శకుడి మొదటి ఎంపిక ఎన్టీఆర్ అని, ఆయన కథలోని ఆలోచనను ఇష్టపడ్డప్పటికీ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు కోరారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తనకు నచ్చే విధంగా కొత్త డ్రాఫ్ట్ రావాలని ఎన్టీఆర్ ఎదురుచూశారని, అయితే ఆశించిన స్థాయిలో స్క్రిప్ట్ మార్పులు జరగకపోవడంతో చివరికి ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపించాయి. అదే సమయంలో ఆయన సుకుమార్ దర్శకత్వంలోని నాన్నకు ప్రేమతో పై దృష్టి పెట్టారు.

తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..! కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

ఆ తర్వాత బ్రహ్మోత్సవం మహేష్ బాబు చేతికి వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది. అంతకు ముందు మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో బ్రహ్మోత్సవం సినిమాపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత రిజల్ట్ మరోలా ఉంది. అయితే బ్రహ్మోత్సవం వెనుక జూనియర్ ఎన్టీఆర్ పేరు మొదట వినిపించిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ అందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు.. ఆయన ఎవరంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us