AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ఫోన్ కాల్ చేసిన ప్రధాని మోదీ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

ఫ్లైదుబాయ్‌ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యం ప్రదర్శించిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఘటన సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను, ఆ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన అంశాలను మచ్చార్‌ ప్రధానితో పంచుకున్నారు.

Watch: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ఫోన్ కాల్ చేసిన ప్రధాని మోదీ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Captain Smit Machchhar Spoke To Pm Narendra Modi
Balaraju Goud
|

Updated on: Oct 02, 2026 | 12:35 PM

Share

ఫ్లైదుబాయ్‌ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యం ప్రదర్శించిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఘటన సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను, ఆ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన అంశాలను మచ్చార్‌ ప్రధానితో పంచుకున్నారు.

దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కో-పైలట్‌ దాడి చేయడంతో మచ్చార్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో ఉన్న 174 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా మచ్చార్‌ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయనను అభినందిస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రస్తుతం మచ్చార్‌ను మెరుగైన చికిత్స కోసం యూఏఈకి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు భారత దౌత్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై యూఏఈ, ఇజ్రాయెల్‌ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. దాడికి దారితీసిన కారణాలు, కో-పైలట్‌ ఉద్దేశ్యంపై అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us