AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup: మళ్లీ అదే గ్రూప్‌లో ఇండియా-ఆస్ట్రేలియా.. ఫైనల్ పగ తీర్చుకునే టైమ్ వచ్చేసింది

ODI World Cup: ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌లో 14 జట్లు తలపడనున్నాయి. గ్రూప్-ఎ లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 10న భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

ODI World Cup: మళ్లీ అదే గ్రూప్‌లో ఇండియా-ఆస్ట్రేలియా.. ఫైనల్ పగ తీర్చుకునే టైమ్ వచ్చేసింది
Odi World Cup
Rakesh
|

Updated on: Oct 02, 2026 | 11:40 AM

Share

ODI World Cup: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వచ్చే తరం క్రికెట్ లవర్లను ఉర్రూతలూగించే వార్తను అందించింది. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో ఈ చారిత్రాత్మక 14వ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ 2న ప్రారంభమై నవంబర్ 21 వరకు సుమారు ఏడు వారాల పాటు ఈ టోర్నీ సాగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటుండగా, మూడు వేర్వేరు రౌండ్లలో 12 మైదానాల్లో మొత్తం 57 మ్యాచ్‌లు జరగనున్నాయి.

అగ్రశ్రేణి జట్లతో భారత్ పోరు

వరల్డ్ కప్‌లో పాల్గొనే 10 జట్లకు నేరుగా గ్రూప్ దశలో ప్రవేశం లభించగా, అందులో భారత్, పాకిస్థాన్ జట్లు కూడా ఉన్నాయి. గ్రూప్-ఎ లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్లకు స్థానం దక్కింది. ఆరో జట్టు ఎవరనేది త్వరలో తేలనుంది. ఈ గ్రూప్‌లో భారత్ (2 సార్లు), ఆస్ట్రేలియా (6 సార్లు), పాకిస్థాన్ (1 సారి) రూపంలో ఏకంగా మూడు మాజీ వరల్డ్ ఛాంపియన్ జట్లు ఉండటం విశేషం. 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో తలపడిన భారత్, ఆస్ట్రేలియా జట్లు అక్టోబర్ 7న జరిగే లీగ్ మ్యాచ్‌లో మళ్లీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుత జట్ల ఫామ్ ఆధారంగా విశ్లేషిస్తే ఈ గ్రూప్-ఎ అత్యంత కఠినమైనదిగా కనిపిస్తోంది.

అక్టోబర్ 10న భారత్-పాకిస్థాన్ మహాసమరం

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. అయినప్పటికీ ఈ దాయాది జట్ల పోరుపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అభిమానుల అంచనాలకు తగినట్లుగానే అక్టోబర్ 10న జోహాన్స్‌బర్గ్‌లోని చారిత్రాత్మక వాండరర్స్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీలో భాగంగా అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 14న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్ 17న క్వాలిఫైయర్ జట్టుతో, అక్టోబర్ 24న జింబాబ్వేతో టీమిండియా తలపడనుంది.

గ్రూప్-బి లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు

మరోవైపు గ్రూప్-బి లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లకు చోటు కల్పించారు. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్, శ్రీలంక గతంలో ఒక్కసారి చొప్పున ఛాంపియన్‌గా నిలిచాయి. గత మూడు వన్డే వరల్డ్ కప్‌లలో రెండింటిలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు ఈ గ్రూప్‌లో స్ట్రాంగ్ జట్టుగా ఉంది. అలాగే బంగ్లాదేశ్ జట్టు ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి పెద్ద జట్లను ఓడించి తమ ఆటతీరును మెరుగుపరుచుకున్నట్లు నిరూపించుకుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత నాకౌట్ పోరు మరింత రసవత్తరంగా సాగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us