Bigg Boss Telugu 10: వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో.. బిగ్‌బాస్ 10లోకి ఈ కాంట్రవర్సీ సింగర్ ఎంట్రీ ఫిక్స్!
పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలో ఉండే సెలబ్రిటీలనే ఎక్కువగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు గా తీసుకుంటారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈసారి కూడా కంటెస్టెంట్ల జాబితాలో కాంట్రవర్సీ పర్సనాలిటీస్ చాలానే ఉండనున్నారని తెలుస్తోంది.

బుల్లితెర ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో పదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇటీవలే అధికారికంగా ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అయితే గత సీజన్ల కంటే ఈ సీజన్ బిగ్ బాస్ మరింత స్పెషల్ గా ఉండనుంది. ఎందుకంటే తెలుగులో రియాలిటీ షో ప్రారంభమై పదేళ్లు గడిచాయి. అందుకే ఈ ల్యాండ్ మార్క్ సీజన్ కోసం దశావతారం కాన్సెప్ట్ అంటూ బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు అద్దనున్నారు. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ పదో సీజన్ కంటెస్టెంట్స్ గా ఎవరు రానున్నారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోది. ఎప్పటిలాగే ఈసారి కూడా సినీ తారలు, బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్లు, యాంకర్లు.. ఇలా అన్నీ కేటగిరీల నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారు. అలాగే సామాన్యుల కు అవకాశం కల్పించేందుకు బిగ్‌బాస్ తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2 కూడా త్వరలోనే స్టార్ట్ కానుందని సమాచారం.
బిగ్‌బాస్ తెలుగు 10 కంటెస్టెంట్స్‌కు సంబంధించి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బుల్లితెర నుంచి పల్లవి గౌడ, తేజస్విని గౌడ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, బుల్లితెర స్టార్ ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి స్టార్ సింగర్ మంగ్లీ పేరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగులో ఫోక్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది మంగ్లీ. ఇప్పుడు సినిమా పాటలు కూడా ఆలపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ సింగర్లలో మంగ్లీ కూడా ఒకరని చెప్పవచ్చు. అలాంటి మంగ్లీ గత కొన్ని రోజులుగా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇటీవల గోకుల నందన అనే ఇన్‌ఫ్రా సంస్థలో మంగ్లీ, ఆమె సోదరుడు కలిసి దాదాపు 200 కోట్ల రూపాయల స్కామ్‌కి పాల్పడ్డారంటూ సుబ్బారావు అనే న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన మంగ్లీ.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని తన పరువు, ప్రతిష్టలను దెబ్బతీయడానికే ఇలా కుట్ర చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది.
సింగర్ మంగ్లీ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఇప్పుడీ వివాదం సమసిపోయినప్పటికీ మంగ్లీ పేరు మాత్రం బాగా వైరలైపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈసారి కంటెస్టెంట్ గా తీసుకురావాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోందట. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ మంగ్లీని సంప్రదించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివాదాల సంగతి పక్కన పెడితే మంగ్లీ మంచి ఎంటర్ టైనర్. ఆమె పాటలు, ఎనర్జీ, జోష్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. అలాంటి మంగ్లీ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే షోకు టాప్ రేటింగ్ వస్తుందని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. మరి మంగ్లీ హౌస్ లోకి వస్తుందో? రాదో? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




