‘బిగ్‌బాస్‌ 4’ ఫ్యాన్స్‌కి షాక్.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నిరోజులేనా..!

కరోనా నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న సినీ రంగం నిదానంగా తమ పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో బుల్లితెరకు సంబంధించిన షూటింగ్‌లు ప్రారంభమైపోయాయి.

'బిగ్‌బాస్‌ 4' ఫ్యాన్స్‌కి షాక్.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నిరోజులేనా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 26, 2020 | 6:06 PM

కరోనా నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న సినీ రంగం నిదానంగా తమ పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో బుల్లితెరకు సంబంధించిన షూటింగ్‌లు ప్రారంభమైపోయాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ పనులను నిర్వాహకులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే జూలై లేదా ఆగష్టులో ఈ సీజన్‌ను ప్రారంభించాలనుకుంటున్న నిర్వాహకులు.. దీనికి హోస్ట్‌గా నాగార్జునను ఫైనల్ చేసినట్లు టాక్. ఇక ప్రస్తుతం కంటెస్టెంట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌ని కేవలం 50 రోజులకే పరిమితం చేయబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొదటి సీజన్ 70 రోజులు, రెండు, మూడు సీజన్లు 100 రోజులకు పైగానే ఎంటర్‌టైన్‌మెంట్ అందించినప్పటికీ.. ఈ సీజన్‌ని మాత్రం అన్ని రోజులు ఉండదని సమాచారం.

ఇక 12 మంది కంటెస్టెంట్‌లు ఈ సీజన్‌లో పాల్గొనబోతుండగా.. కరోనా నేపథ్యంలో బిగ్‌బాస్ 4ను పూర్తిగా మార్చేయనున్నారట. కంటెస్టెంట్‌లకు బెడ్‌రూమ్‌ మొదలు బాత్‌రూమ్‌ల వరకు అన్నీ సెపరేట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌లు కూడా భౌతిక దూరం ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన సెట్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసినట్లు కూడా టాక్. మరి బిగ్‌బాస్ 4 ఎప్పుడు ప్రారంభం కాబోతోంది..? ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు..? ఎన్ని రోజులు ఈ సీజన్‌ ఉండనుంది..? వంటి పలు ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.