‘అయ్యప్పనుమ్ కొషియుం’ తెలుగు రీమేక్..ఆ డైరెక్ట‌ర్ ఫిక్స్..!

మలయాళ బ్లాక్ బాస్ట‌ర్ సినిమా ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తెలుగులో రీమేక్ అవుతోన్న విష‌యం తెలిసిందే. హీరోలుగా చాలామంది పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ.. చివ‌రిగా రవితేజ, రానా దగ్గుబాటి ద‌గ్గ‌ర‌ వార్తలు ఆగిపోయాయి.

‘అయ్యప్పనుమ్ కొషియుం’ తెలుగు రీమేక్..ఆ డైరెక్ట‌ర్ ఫిక్స్..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 26, 2020 | 4:45 PM

మలయాళ బ్లాక్ బాస్ట‌ర్ సినిమా ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తెలుగులో రీమేక్ అవుతోన్న విష‌యం తెలిసిందే. హీరోలుగా చాలామంది పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ.. చివ‌రిగా రవితేజ, రానా దగ్గుబాటి ద‌గ్గ‌ర‌ వార్తలు ఆగిపోయాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా చిత్ర నిర్మాణంలో భాగమవుతోందని సమాచారం. అయితే, ఈ సినిమాకు దర్శకుడి విష‌యంలో కూడా చాలా చ‌ర్చ జ‌రిగింది. మొన్న‌టివ‌ర‌కు సుధీర్ వ‌ర్మ పేరు గ‌ట్టిగా వినిపించింది. తాజాగా మ‌రో ద‌ర్శ‌కుడి పేరు తెర‌పైకి వ‌చ్చింది. సాగర్ కె చంద్రను ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తెలుగు రీమేక్‌కు ఫైనల్ చేశార‌ని స‌మాచారం. ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారంట‌. సాగర్ కె చంద్ర గ‌తంలో ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాలు తెర‌కెక్కించారు. అవి రెండూ కూడా ఆయ‌న‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.

కాగా మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ రోల్ లో ద‌గ్గుబాటి హీరో రానా, బిజు మీనన్ చేసిన పోలీస్ అధికారి పాత్రలో రవితేజ నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్ర‌ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభ‌మ‌వుతుంద‌ని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైన‌ల్ చేయాల్సి ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.