మాహిష్మతి రాజ్యంలో మాస్కులు తప్పనిసరి.. వీడియో షేర్ చేసిన రాజమౌళి
ఈ క్రమంలో మరోసారి మాస్క్ వినియోగం గురించి తెలియజేస్తూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' సినిమాలో రానా, ప్రభాస్‌ల మధ్య ఓ ఫైట్ సీన్ వస్తుంది. అందులో బాహుబలి, భల్లాలలు ముఖాలకు మాస్కులు..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ విపరీతంగా పెరిగిపోతుంది. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత.. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఏం చేయాలన్నా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు అన్ని రంగాలపై కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా రంగంపై, రాజకీయ నాయకుల్లో సైతం కోవిడ్ కలవరం పుట్టిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ వినియోగంపై పలు సూచనలు చేశాయి. వీటిని పట్టించుకోని వారికి జరిమానా కూడా విధిస్తున్నారు అధికారులు.
ఈ క్రమంలో మరోసారి మాస్క్ వినియోగం గురించి తెలియజేస్తూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమాలో రానా, ప్రభాస్‌ల మధ్య ఓ ఫైట్ సీన్ వస్తుంది. అందులో బాహుబలి, భల్లాలలు ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీంతో నవ్వుకుంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ అవుతోంది.
మాస్క్ ఉపయోగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవినాష్ అండ్ టీం బాహుబలిలోని ఈ సన్నివేశాన్ని వీఎఫ్‌ఎక్స్‌ని ఉపయోగించి ప్రభాస్, రానాల ముఖాలకి మాస్క్ వేశారు. మాహిష్మతిలోనూ మాస్కులు తప్పనిసరి అని క్యాప్షన్ ఇస్తూ ఈ వీడియో షేర్ చేశారు. దాన్ని రాజమౌళి రీట్వీట్ చేస్తూ.. గుడ్ జాబ్ అంటూ పొడిగారు.
Good job @avitoonindia and @coollazz #Unitedsoft VFX Studio team! #BBVsCOVID #IndiaFightsCorona #StaySafe
I hope everyone stays safe and exercise caution in these times. pic.twitter.com/kmhOyK3012
— rajamouli ss (@ssrajamouli) June 26, 2020
Read More:
‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..
కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..