అభిషేక్ మనూ సింఘ్వికి కరోనా పాజిటివ్..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్ అభిషేక్ మనూ సింఘ్వికి కరోనా పాజిటివ్ అని తేలింది.
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్ అభిషేక్ మనూ సింఘ్వికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న అయన.. తాజాగా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు, సుప్రీంకోర్టు లాయర్లు అభిషేక్ ను కలవగా, ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు.
Also Read: జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర.. 15 రోజులకు కుదింపు..