ఆకట్టుకుంటోన్న ‘రాక్షసుడు’ టీజర్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాక్షసుడు’. తమిళ హిట్ మూవీ ‘రత్ససన్’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. స్కూల్‌కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి క్రూరంగా హింసించి చంపే సమాజం పట్ల కక్ష కట్టిన ఓ సైకో కథే ఈ సినిమా నేపధ్యమని తెలుస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తుండగా.. స్కూల్ టీచర్ […]

ఆకట్టుకుంటోన్న 'రాక్షసుడు' టీజర్
Ravi Kiran

|

Jun 01, 2019 | 11:34 AM

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాక్షసుడు’. తమిళ హిట్ మూవీ ‘రత్ససన్’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

స్కూల్‌కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి క్రూరంగా హింసించి చంపే సమాజం పట్ల కక్ష కట్టిన ఓ సైకో కథే ఈ సినిమా నేపధ్యమని తెలుస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తుండగా.. స్కూల్ టీచర్ పాత్రను హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోషిస్తోంది. సస్పెన్స్ ఎలెమెంట్స్‌తో చక్కటి బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ ఏ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. జిబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని జులై 18న విడుదల చేయనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu