Bigg Boss 14: బిగ్‏బాస్ ఇంట్లో మరోసారి రచ్చ.. టాస్క్‏లోనే అలా చేసిన కంటెస్టెంట్ రాఖీ సావంత్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jan 20, 2021 | 8:01 PM

కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న బిగ్‏బాస్ 14 సీజన్లో మరోసారి రచ్చ మొదలైనట్లుగా తెలుస్తోంది. తాజా ప్రోమో ప్రకారం బిగ్‏బాస్

Bigg Boss 14: బిగ్‏బాస్ ఇంట్లో మరోసారి రచ్చ.. టాస్క్‏లోనే అలా చేసిన కంటెస్టెంట్ రాఖీ సావంత్..

కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న బిగ్‏బాస్ 14 సీజన్లో మరోసారి రచ్చ మొదలైనట్లుగా తెలుస్తోంది. తాజా ప్రోమో ప్రకారం బిగ్‏బాస్ ఇచ్చిన టాస్క్‏లో కంటెస్టెంట్స్ రెడ్ మరియు యెల్లో రెండు గ్రూపులుగా మారారు. అందులో రూబీనా దిలాక్ మరియు రాహుల్ వైద్య టీం లీడర్లుగా వ్యవహరించారు. ఈ టాస్క్ సమయంలో మరో టీంలీడర్ అయిన అర్షిఖాన్ పని తన అపోజిట్ టీం సభ్యులను వాష్‏రూంకు వెళ్ళనీయకుండా చూసుకోవడం. అయితే ఇదే సమయంలో రూబీనా టీంలో ఉన్న రాఖీ సావంత్ తనను తాను నియంత్రించుకోలేక నిల్చున్న చోటే వాష్‏రూంకు వెళ్లింది. ఇక ఇదే విషయాన్ని తన టీంలీడర్ రూబీనా చెప్పుకోని.. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటూ ప్రదేయపడింది.

దీంతో రూబీనా తన సహటీం మెంబర్ రాఖీకి సహయం చేయడం కోసం ఒక ప్లాన్ రచించింది. రాఖీకి ఇంట్లో కాస్తా పని ఉందని చెప్పి వెళ్ళి.. తన దుస్తులను మార్చుకోవాలంటూ సూచించింది. టాస్క్ మొదటి రోజు రాఖీ తన ఆటతీరుతో అందరిని అలరించింది. అంతేకాకుండా ఆకలేస్తుంది తినడానికి ఏమైనా ఇవ్వాలంటూ బిగ్‏బాస్‏ను ప్రాధేయపడింది. చివరికి తాను అరటిపండు తొక్క కూడా తిన్నానంటూ బిగ్‏బాస్‏కు కంప్లైంట్ చేసింది. బిగ్‏బాస్ ఇచ్చిన ఈ టాస్క్ రేషన్ సరుకులను పొందడం. ముందుగా గార్డెన్ ఏరియాలో ఈ రెండు జట్లను ఉంచారు. అందులో రెడ్ టీం సభ్యులు వాష్ రూం ఉపయోగించాడానికి వీల్లేదని పసులు టీం లీడర్ అర్షి తెలిపింది. తాజా ప్రోమోలో చూపించిన దాని ప్రకారం రాఖీ సావంత్ వాదనకు దిగింది. సోనాలి పోగాట్ తన గుడ్లను రాకుండా చేసిందని.. అలాగే అభినవ్ శుక్లా ఎలిమినేట్ చేయాలని అడిగినట్లుగా తెలిపింది. కానీ అది తనకు ఇష్టం లేదని.. బయటకు వెళ్ళిన తర్వాత అభినవ్‏తో స్నేహాన్ని కొనసాగించాలనుకుంటున్నాని తెలిపింది.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu