బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ తాను చిన్నతనంలో ఎదుర్కోన్న సమస్యల గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. తాను కెనాడాలో ఉన్నప్పుడు స్కూల్లోని తన తోటి విద్యార్థులు తనను ఎలా ఏడిపించారో అనే విషయాలను టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “స్కూల్లో చదువుతున్నప్పుడు కొంత మంది నన్ను అవహేళనగా చూసేవారు.. అలాగే మరికొంత మంది తనను బెదించేవారు.. ఎందుకంటే నేను ఒక ఇండియన్ అమ్మాయిని.. నేను కాస్త నలుపు రంగుతో ఉండడం, అలాగే నా జుట్టు బ్లాక్‌గా ఉండడం, మరియు నేను సన్నగా ఉండడమే కాకుండా సరైన దుస్తులు వేసుకోలేదంటూ నన్ను ఏడిపించేవారు. సాధరణంగా స్కూల్లలో అవి మాములే కదా” అంటూ చెప్పుకోచ్చింది. ఇక తాను పెరుగుతున్న సమయంలో అలాంటి మాటలను పట్టించుకోలేదని.. వాటిని తన అనుభవాలుగా మలుచుకున్నాని తెలిపింది. అక్కడ ఉన్నవారు సాధరణంగా ఎదుటివారిని అవహేళన చేయడం మాములే అని… కానీ అలాంటి మాటలకు తాను నిరుత్సాహపడకుండా.. ధైర్యంగా వాటిని ఎదుర్కున్నానంటూ తెలిపింది. ఇక బెదిరింపులు, అవహేళనలు ఎదురైనప్పుడు బాధపడకుండా.. వాటిని ఎదుర్కోనేందుకు ఒక స్టాండ్ తీసుకోవడానికి ఇతరులకు సలహ ఇస్తుంటాను అని తెలిపింది.