AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babil Khan: బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ.. బాబిల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..

బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ. పని చేయడానికి ఇది సరైన ప్లేస్ కాదు. యువ నటుడు చేసిన ఈ వ్యాఖ్యలపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. అయితే ఇది నిజమైనా ఆవేదనా.. లేక సినిమా ప్రమోషనా.. అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే.. ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బాబిల్ దీన్ని డిలీట్ చేశారు. అప్పటికే ఇది వైరల్‌గా మారడంతో చర్చ మొదలైంది.

Babil Khan: బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ.. బాబిల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..
Babil Khan, Ananya Panday
Shaik Madar Saheb
|

Updated on: May 05, 2025 | 9:07 AM

Share

బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ.. పని చేయడానికి ఇది సరైన ప్లేస్ కాదు.. అంటూ బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు చర్చకు దారితీశాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ తీరును ఎండగట్టిన బాబిల్.. కొందరిని విమర్శిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ ఓ మర్యాద లేని పరిశ్రమ అని ఆరోపించారు. ఫేక్ ఇండస్ట్రీ అని చెబుతూ ఎమోషన్ అయ్యారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఉండే ఇబ్బందులను ప్రస్తావిస్తూ, పలువురు యాక్టర్స్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అర్జున్ కపూర్, షనయా కపూర్, అనన్య పాండే వంటి వారి తీరును ఎండగట్టారు. పని చేయడానికి బాలీవుడ్ మంచి ప్లేస్ కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకునే వారు కొంతమంది మాత్రమే ఉంటారన్నారు.

ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బాబిల్ దీన్ని డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఇది వైరల్‌గా మారడంతో చర్చ మొదలైంది. బాలీవుడ్ గురించి మాట్లాడిన వీడియోలన్నింటినీ డిలీట్ చేసి.. తన ఇన్ స్టా అకౌంట్‌ను సైతం డీయాక్టివేట్ చేశారు. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాబిల్ నిజంగానే తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చెబుతున్నారా ? లేక ఇదంతా సినిమా ప్రమోషన్స్‌లో భాగమా ? అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

వీడియో చూడండి..

ఈ క్రమంలోనే.. ఇర్ఫాన్ కుమారుడు, నటుడు బాబిల్ ఖాన్ తన ఖాతాను బ్లాక్ చేసిన కొన్ని గంటల తర్వాత మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. తన ఖాతాను తొలగించే ముందు పోస్ట్ చేసిన తన మెల్ట్‌డౌన్ వీడియోను ‘చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని’ నటుడు చెప్పాడు. తన స్నేహితులు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, షానయ కపూర్, అర్జున్ కపూర్, గౌరవ్ ఆదర్శ్, అర్జిత్ సింగ్‌లు ఇచ్చిన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత తన మొదటి పోస్ట్‌లో, నటుడు కుబ్రా సైట్ కథను తిరిగి పోస్ట్ చేస్తూ కృతజ్ఞతా నోట్ రాయడం చర్చనీయాంశంగా మారింది.

ఖాలా మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన బాబిల్ ఖాన్.. ఆ తర్వాత అడపా దడపా పలు సినిమాల్లో నటించారు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘లాగ్ అవుట్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాకు బానిసగా మారిన యువత జీవితాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి