- Telugu News Photo Gallery Cinema photos What is Salman Khan's next movie? Will there be a sequel to that hit movie?
Salman Khan: సల్మాన్‌ఖాన్ నెక్స్ట్ మూవీ ఏంటి.? ఆ హిట్ మూవీ సీక్వెల్ ఉంటుందా.?
సల్మాన్‌ఖాన్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు? అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. వరుస పరాజయాలు పలకరించడంతో నెక్స్ట్ స్టెప్‌ని ఆచి తూచి వేయాలన్నది సల్లూభాయ్ నిర్ణయం. మరి ఆ వరుసలో బజ్‌రంగీ భాయీజాన్... ఉంటుందా? లేదా మరేదైనా సినిమా ఉందా.? ఈరోజు మనం తెలుసుకుందాం..
Updated on: May 05, 2025 | 9:39 AM

ఎలా ఉంటుందో.. ఏం జరుగుతుందో తెలియని కొత్త పరిచయాల కన్నా, ఇలాగే ఉంటుందని తెలిసిన పాత కథలే మేలనే నిర్ణయానికి సల్మాన్ వచ్చేశారా? అవును.. అని స్పష్టంగా చెప్పకపోయినా.. అలాగే ఉన్నట్టుంది పరిస్థితి అని అంటోంది సల్మాన్ కాంపౌండ్.

బజ్‌రంగీ భాయీజాన్ సీక్వెల్‌తో సక్సెస్ చూడాలని అనుకుంటున్నారట సల్మాన్.దీని కోసం విజయేంద్రప్రసాద్ ఆల్రెడీ ఓ కథ చెప్పేశారట. ఆ కథ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి కూడా నచ్చిందట.

మరి ప్రొడక్షన్ ఎప్పుడు మొదలవుతుంది? సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయాలు తెలియాల్సి ఉందంటున్నారు రైటర్. రీసెంట్‌గా ఏం చేసినా సక్సెస్ మాత్రం పలకరించలేదు సల్మాన్‌ఖాన్‌కి.

రీసెంట్‌గా మురుగదాస్ సినిమా సికందర్ కూడా కలిసిరాలేదు. ఇది డిసాస్టర్ అయింది. అందుకే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన బజ్‌రంగీ భాయీజాన్‌ని లైన్‌లో పెట్టాలని భావిస్తున్నారట కండలవీరుడు.

ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న హిట్ ఈ సీక్వెల్‌తో వచ్చినా బావుంటుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి చూడలేక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.? ఇదైనా సల్మాన్‌ఖాన్‌ని సక్సెస్ దారిలో నడిపిస్తుందా.? లేక వేరేదైన జరుగుతుందా.?




