- Telugu News Photo Gallery Cinema photos International market is the target of those films, which is why they are planning for it.
Tollywood Updates: ఇంటర్నేషనల్ మార్కెట్ ఆ సినిమాల టార్గెట్.. అందుకే ఆ ప్లాన్..
మన దగ్గర రిలీజ్ అయ్యాక ఇంగ్లిష్‌లోనో, చైనీస్‌లోనో, జపనీస్‌లోనో రిలీజ్ చేయడం ఎందుకు? సైమల్‌టైనియస్‌గా సినిమాలను ఫారిన్ లాంగ్వేజెస్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు కదా.. జక్కన్న మనసులోనూ అదే ఉందా.. ఇప్పుడు మూవీ లవర్స్ మధ్య జరుగుతున్న ఇంటర్నేషనల్ డిస్కషన్ ఇది...
Updated on: May 05, 2025 | 9:50 AM

టాక్సిక్ సినిమాను ఇంగ్లిష్‌లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. కాసింత ఎక్కువ టైమ్ తీసుకున్నా ఫర్వాలేదు.. ఈ సారి ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్నీ దాటేయాల్సిందే.. మన పేరు అన్ని చోట్లా వినిపించాల్సిందే అంటున్నారు రాకీ భాయ్ సైన్యం.

సేమ్ టు సేమ్ అదే మాటను ఫాలో అవుతున్నారు కాంతార మూవీ టీం. కాంతార చాప్టర్ ఒన్ విషయంలో అసలు తగ్గేదేలే అనే కాన్సెప్ట్ ని కాన్ఫిడెంట్‌గా ఫాలో అవుతోంది టీమ్. అందుకే ఫారిన్ లాంగ్వేజెస్ మీద మరింత ఫోకస్ చేస్తోంది.

మన దగ్గర హనుమాన్ సమయంలోనే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ గురించి ప్రస్తావించారు ప్రశాంత్ వర్మ. అప్పుడు కుదరని పనిని జై హనుమాన్‌తో ట్రాక్‌లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ఏదీ చెప్పి చేయడం లేదు జక్కన్నకి. అంతా సైలెంట్‌గా అలా చేసుకుంటూ వెళ్తున్నారంతే. ఎస్ఎస్ఎంబీ29ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారన్నది కూడా వైరల్ న్యూస్.

హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమా మిరాయ్. ఇందులో మంచు మనోజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఈ సినిమా డైరక్ట్ రిలీజ్‌లో చైనీస్ కూడా ఉంది. అన్ని సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ పెట్టుకున్నాయి.




