ఎలాంటి తప్పు చేయలేదని మా పేరెంట్స్‌కి చెప్పాను.. యానిమల్ బ్యూటీ సెన్సేషన్ కామెంట్స్
పది రోజుల్లో ఏకంగా రూ. 600 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు పలు విమర్శలు సైతం ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉపయోగించి డైలాగ్స్ కొన్ని సన్నివేశాల పట్ల వ్యతిరేకత ఎదురైంది. మరీ ముఖ్యంగా నటి త్రిప్తి డిమ్రి నటించిన కొన్ని సన్నివేశాలపై నెట్టింట భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న...

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామిని సృష్టించిందీ సినిమా.
పది రోజుల్లో ఏకంగా రూ. 600 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు పలు విమర్శలు సైతం ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉపయోగించి డైలాగ్స్ కొన్ని సన్నివేశాల పట్ల వ్యతిరేకత ఎదురైంది. మరీ ముఖ్యంగా నటి త్రిప్తి డిమ్రి నటించిన కొన్ని సన్నివేశాలపై నెట్టింట భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి సెన్సేషన్ కామెంట్స్ చేసింది.
ఇంటిమేట్ సీన్స్‌లో నటించడంపై తమ పేరెంట్స్ షాక్‌కి గురయ్యారని చెప్పుకొచ్చిన బ్యూటీ.. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను తమ పేరెంట్స్ ఎప్పుడూ చూడలేదన్నారని, ఇలాంటివి చేయకుండా ఉండాల్సిందన్నారు. ఇలాంటి సన్నివేశాల పట్ల తాము బాధపడుతున్నామని చెప్పుకొచ్చారు. అలాంటి సీన్స్ నుంచి తేరుకోవడానికి తమ పేరెంట్స్‌కు సమయం పట్టిందని, అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అది కేవలం తన వృత్తిలో భాగమేనని పేరెంట్స్‌కు చెప్పినట్లు త్రిప్తి డిమ్రి తెలిపారు. తాను ఒక నటి అని, పోషించే ప్రతి పాత్రకు వందశాతం న్యాయం చేయాల్సి ఉంటుందని, యానిమల్ చిత్రంలో తాను అదే పనిచేశానని క్లారిటీ ఇచ్చారు.
ఇక యానిమల్ కోసం సంప్రదించిన సమయంలోనే రణ్‌బీర్‌తో ఇలాంటి సన్నివేశాలు ఉంటాయని సందీప్ తెలిపారని చెప్పుకొచ్చారు. బ్యూటీ అండ్ బీస్ట్ లాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసే ఉద్దేశంతోనే ఈ పాత్రను డిజైన్ చేశారని సందీప్ చెప్పిన విషయం విన్నాక.. సినిమాలో ఆ సన్నివేశం అవసరమని అర్థమైందన్నారు. ఆ సన్నివేశంలో నటించడానికి ఓకే చెప్పడానికి అదే కారణమన్నారు. చిత్రీకరణ సమయంలోనూ సందీప్.. ఎవరినీ సెట్‌లోకి అనుమతించలేదని, సందీప్ సినిమాటోగ్రాఫర్ మాత్రమే పాల్గొన్నారని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..