ఫుల్ ఫామ్ లో అనీల్ రావిపూడి.. ఎఫ్3 తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా..?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో అనీల్ రవిపూడి ఒకరు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనీల్. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను పట్టాలెక్కించి పనిలో ఉన్నాడు.

ఫుల్ ఫామ్ లో అనీల్ రావిపూడి.. ఎఫ్3 తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా..?
Follow us

|

Updated on: Dec 21, 2020 | 7:48 PM

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో అనీల్ రవిపూడి ఒకరు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనీల్. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను పట్టాలెక్కించి పనిలో ఉన్నాడు. 2019సంక్రాంతికి వచ్చిన వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక తమన్నా, మెహరీన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాలో ముగ్గురు హీరోలు కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత అనీల్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వరుస హిట్లు అందుకుంటున్న అనీల్ తో పని చేయడానికి హీరోలంతా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అనీల్ మాత్రం నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే బాలయ్య కోసం అదిరిపోయే స్రిప్ట్ కూడా రెడీ చేసాడని టాక్. ఇక ఎఫ్3 సినిమాను ఆర్నెళ్లలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు అనీల్. ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే అన్నీ పక్కాగా సిద్ధం చేసుకున్నాడు. ఇక బాలయ్య అనీల్ కాంబినేషన్ లో సినిమా అంటే మాములుగా ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు. నిజానికి ఆయన 100వ సినిమాను అనీల్  చేయాల్సి ఉన్నా అనుకోకుండా ఆగిపోయింది. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా బాలయ్యతో అవకాశం కోసం చూస్తూనే ఉన్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న బిబి3 సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.