Bigg Boss 4: బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్‌కు ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Bigg Boss 4: తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. 106 రోజుల ఎంటర్టైన్మెంట్‌కు నిన్నటితో తెరపడింది. డిసెంబర్ 20(ఆదివారం)న ఫినాలే ఎపిసోడ్...

Bigg Boss 4: బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్‌కు ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Follow us

|

Updated on: Dec 21, 2020 | 8:46 PM

Bigg Boss 4: తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. 106 రోజుల ఎంటర్టైన్మెంట్‌కు నిన్నటితో తెరపడింది. డిసెంబర్ 20(ఆదివారం)న ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కన్సర్ట్, హీరోయిన్ల డ్యాన్సులతో వీక్షకులకు కన్నుల పండుగగా తలపించింది. ఆఖరిలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో అప్పటి దాకా సోసోగానే సాగిన ఎపిసోడ్‌ రూపమే మారిపోయింది. సీజన్ 3లో మాదిరిగానే అన్నయ్య మరోసారి తనదైన మార్క్ పంచ్‌లతో ఆకట్టుకున్నారు. టైటిల్ పోరులో అభిజీత్ విన్నర్‌ కాగా.. అఖిల్ రన్నరప్‌గా, సోహైల్ రూ. 25 లక్షలతో సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

ఇదిలా ఉంటే చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవితో పాటు లక్ష్మీ రాయ్, అనిల్ రావిపూడి, మెహ్రీన్, ప్రణీతలు అతిధులుగా వచ్చిన ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం స్టార్ మా ఎంత ఖర్చు చేసిందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి సమాధానమే రూ. 2.5 కోట్లు అని తెలుస్తోంది. విన్నర్‌కు ఇచ్చే రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో సహా.. భారీ సెట్‌, ఈవెంట్‌కు.. చేసిన డాన్సులకు కలిసి రెండున్నర కోట్లు ఖర్చయిందని టాక్ వినిపిస్తోంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్‌కు కోటిన్నర ఖర్చు చేశారని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్.!