నటుడు అర్జున్‌రామ్ పాల్‌‌‌ను ప్రశ్నిస్తున్న ఎన్సీబీ అధికారులు.. అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు తారలు ఈ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణలో కూడా పాల్గొన్నారు.

  • Rajeev Rayala
  • Publish Date - 7:23 pm, Mon, 21 December 20
నటుడు అర్జున్‌రామ్ పాల్‌‌‌ను ప్రశ్నిస్తున్న ఎన్సీబీ అధికారులు.. అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు..

నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు తారలు ఈ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణలో కూడా పాల్గొన్నారు. మరికొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. ఇక అర్జున్ రాంపాల్ మరియు ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో  అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అర్జున్ ఇంట్లో దొరికిన మెడిసిన్స్ కు సంబంధించి రాంపాల్ ను ఎన్సీబీ విచారణకు డిసెంబర్ 16న మరోసారి రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే వ్యక్తిగత కారణాలవల్ల ఒక వారం గడువు కోరాడు అర్జున్. దాంతో సోమవారం డిసెంబర్ 21న ఎన్‌సిబి రెండో సారి విచారణను ఎదుర్కోవటానికి ముంబై కార్యాలయానికి వచ్చారు. తన ఇంట్లో లభించిన ముందులు డిప్రషన్ నుంచి బయటపడేందుకు డాక్టర్ సూచించిన మెడిసిన్స్ అని.. అర్జున్ రాంపాల్ దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ అధికారులకు అందజేశారు. అయితే ఎన్సీబీ కి అతను సమర్పించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే అర్జున్ రాంపాల్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.అర్జున్ రాంపాల్ మాత్రం తనకు ఎలాంటి డ్రగ్ పెడ్లర్లతో సంబంధం లేదని.. విచారణకు సహకరిస్తున్నానని.. అతను తన నివాసంలో దొరికిన మందులు తనకు డాక్టర్స్ సూచించిన మేరకే వాడుతున్నానని