Anasuya: మిమ్మల్ని ఆంటీ అంటే ఎందుకు కోపం వస్తుంది.? నెటిజన్ ప్రశ్నకు అనసూయ సమాధానం ఏంటంటే..

అనసూయ.. తెలుగు వారికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగారు అనసూయ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇక సినిమాల్లో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ..

Anasuya: మిమ్మల్ని ఆంటీ అంటే ఎందుకు కోపం వస్తుంది.? నెటిజన్ ప్రశ్నకు అనసూయ సమాధానం ఏంటంటే..
Anasuya Instagram
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 03, 2023 | 6:11 PM

అనసూయ.. తెలుగు వారికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగారు అనసూయ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇక సినిమాల్లో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన కెరీర్‌ విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచకోవడం అనసూయకు అలవాటు. కొన్ని సందర్భాల్లో ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి సైట్స్‌లో అభిమానులతో ముచ్చటించే అనసూయ తాజాగా ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్‌తో చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు.

అయితే ఈ సందర్భంలో ఈ యాంకరమ్మకు ఎదురైన ఓ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. గతంలో కొందరు సోషల్‌ మీడియాలో కొందరు తనను ఆంటీ అంటూ సంబోధించడంపై అనసూయ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఇదే ప్రశ్నను సంధించారు. ‘అక్కా మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకంత కోపం వస్తుంది’అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఎందుకంటే వాళ్ల అర్థాలు వేరే ఉంటాయి. ఏదేమైనా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ల ఖర్మకే వదిలేస్తున్నా. నాకు చాలా ముఖ్యమైన పనులు ఉండటంతో అలాంటి కామెంట్లు పట్టించుకోవటం లేదు’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

Anasuya ఇక చాలా మందికి స్ఫూర్తి అయిన మీరు సైలెంట్‌గా ఉండడం బాగాలేదన్న ఓ నెటిజన్‌ ప్రశ్నకు బదులిచ్చిన అనసూయ.. ‘ థాంక్యూ. నేను సైలెంట్‌గా లేను. కొంచెం ఫోకస్‌ మార్చాను. మాట్లాడాలి అన్నప్పుడు నన్ను నేనే కంట్రోల్‌ చేసుకోలేను’ అని బదులిచ్చారు. సండే స్పెషల్‌ ఏంటన్న ప్రశ్నకు.. ‘అమ్మ చేసిన మామిడికాయ పప్పు, బంగాళాదుంప వేపుడు, చుక్కకూర పచ్చడి’ అని చెప్పుకొచ్చారు. ఇక అనసూయ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘అరి’, సహా పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తున్నారు.